టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఎవరైనా విమర్శలు చేస్తే మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ విరుచుకుపడతారు. కానీ ఎవ్వరి కౌంటర్స్ పెద్దగా హైలెట్ కావు. కానీ జగన్‌ని విమర్శిస్తే… నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చే తీరు మాత్రం అందర్ని ఆకట్టుకుంటుంది. ఇక టీడీపీ - చంద్రబాబు అనగానే ఇంకా చెలరేగిపోతుంది రోజా. ఇప్పుడు రోజా ఇచ్చిన కౌంటర్లే వార్తల్లో హాట్ టాపిక్ గా మారాయి.
జగన్-కేటీఆర్ భేటీపై ఎన్ని విమర్శలు చెయ్యాలో అన్నీ చేసింది టీడీపీ. ఈ భేటీతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దగ్గర జగన్ తాకట్టు పెట్టారని విమర్శించింది. దీనిపై టీడీపీకి - ఆ పార్టీకి చెందిన నాయకులకు రోజా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అమరావతి ఓపెనింగ్ కు వచ్చినప్పుడు శిలాఫలకం పై కేసీఆర్ పేరు ఉన్నప్పుడు ఈ టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అని విమర్శించింది. అదే విధంగా.. కేసీఆర్ వస్తే.. ఆయనకు 36 రకాల వంటలు చేసిపెట్టి.. ఆయన మూతి తుడిచినప్పుడు మీ ఆత్మగౌరవం ఎక్కడికిపోయింది అని కౌంటర్ ఇచ్చింది రోజా. అప్పుడు మీరంతా గాడిదలు కాస్తున్నారా అంటూ తనదైన స్టైల్లో సెటైర్స్ వేసింది. కేసీఆర్ తో చంద్రబాబు కలవాలనుకున్నారని.. అది కుదరలేదు కాబట్టే ఇప్పుడు వైసీపీపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టింది రోజా.