జంతువుల్లో అత్యంత మంద బుద్ది కలిగిన జీవిగా గొర్రెలకు పేరుంది. ఏదైనా ఒక గొర్రె ముందు వెళితే దాన్ని అనుసరిస్తూ మిగితావి వెళుతూ ఉంటాయి. ఒక గొర్రె బావిలో పడిందంటే చాలు మిగతావన్నీ కూడా బావిలోకి లైన్ కట్టేస్తాయి. ఇలాంటి సంఘటనలు తరుచూ చూస్తూనే ఉంటాం. అందుకే మనుషులు ఎవరైనా మంద బుద్దితో ప్రవర్తిస్తే వాడిది గొర్రె తలకాయరా అంటూ తోటివాళ్లు కామెంట్ చేస్తూ ఆట పట్టిస్తుంటారు..
కాగా ఇటీవల కాలంలో గొర్రెలకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా చైనాలోని ఓ గొర్రెల మంద వరుసగా 12 రోజుల పాటు ఒకేచోట వృత్తాకారంలో తిరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనపై పలువురు భయాందోళన సైతం చెందారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి మిస్టరీ తాజాగా చేధించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని మంగోలియా ప్రాంతానికి మియావో అనే రైతు గొర్రెలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతీరోజు గొర్రెలను మేపేందుకు సమీపంలోని ఒక పొలం వద్దకు తీసుకెళ్లేవాడు. ఈక్రమంలోనే కొన్ని గొర్రెలు ఒకే చోట వృత్తాకారంలో తిరగడం గమనించాడు. ఈ విషయంలో ఆ నోటా.. ఈ నోటా చేరడంతో మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
12 రోజులుగా గొర్రెలు ఒకే చోట వృత్తాకారంలో తిరుగుతున్నాయని చైనా డైలీ వీడియోతో సహా కథనంలో పేర్కొనడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ లోని గ్లౌసెస్టర్ హార్ట్ పురీ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ ప్రొఫెసర్ డైరెక్టర్ మాట్ బెల్ ఈ సంఘటనపై పరిశోధన చేపట్టారు. గొర్రెలు చాలా రోజులుగా ఒకే ప్రాంతంలో తిరగడంతో వాటిలో మందబుద్ది ఏర్పడిందని తేల్చి చెప్పారు.
వీటిలో నిరాశ కారణంగా ఇలా చుట్టూరా తిరగడం ప్రారంభిచాయన్నారు. ఒక గొర్రె తిరగడంతో దాని వెనుక మరికొన్ని గొర్రెలు తిరగడం ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. అయితే మియావో అనే రైతుకు 34 గొర్రెల దొడ్లు ఉన్నాయి. వీటిలో ఒక దొడ్డిలోని గొర్రెలు మాత్రం విచిత్రంగా వృత్తాకారంలో తిరుగుతున్నాయి.
దీనిపై మాట్ బెల్ స్పందిస్తూ.. ఒక దొడ్డిలో ఉండే గొర్రెల్లో ఒకటి రెండు గొర్రెలు మాత్రమే ఇలా ప్రవర్తిస్తాయని కానీ.. మందంతా ఇలా సర్కిల్స్ లో తిరగడం మాత్రం చాలా అరుదని చెప్పారు. ఏది ఏమైనా గొర్రెలు ఎందుకు వృత్తాకారంలో తిరుగుతున్నాయనే విషయం తెలియడంతో.. ఎలాంటి ప్రమాదం లేదని చైనీయులు ఊపిరి పీల్చు కుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
Full View Full View
కాగా ఇటీవల కాలంలో గొర్రెలకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా చైనాలోని ఓ గొర్రెల మంద వరుసగా 12 రోజుల పాటు ఒకేచోట వృత్తాకారంలో తిరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనపై పలువురు భయాందోళన సైతం చెందారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి మిస్టరీ తాజాగా చేధించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని మంగోలియా ప్రాంతానికి మియావో అనే రైతు గొర్రెలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతీరోజు గొర్రెలను మేపేందుకు సమీపంలోని ఒక పొలం వద్దకు తీసుకెళ్లేవాడు. ఈక్రమంలోనే కొన్ని గొర్రెలు ఒకే చోట వృత్తాకారంలో తిరగడం గమనించాడు. ఈ విషయంలో ఆ నోటా.. ఈ నోటా చేరడంతో మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
12 రోజులుగా గొర్రెలు ఒకే చోట వృత్తాకారంలో తిరుగుతున్నాయని చైనా డైలీ వీడియోతో సహా కథనంలో పేర్కొనడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ లోని గ్లౌసెస్టర్ హార్ట్ పురీ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ ప్రొఫెసర్ డైరెక్టర్ మాట్ బెల్ ఈ సంఘటనపై పరిశోధన చేపట్టారు. గొర్రెలు చాలా రోజులుగా ఒకే ప్రాంతంలో తిరగడంతో వాటిలో మందబుద్ది ఏర్పడిందని తేల్చి చెప్పారు.
వీటిలో నిరాశ కారణంగా ఇలా చుట్టూరా తిరగడం ప్రారంభిచాయన్నారు. ఒక గొర్రె తిరగడంతో దాని వెనుక మరికొన్ని గొర్రెలు తిరగడం ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. అయితే మియావో అనే రైతుకు 34 గొర్రెల దొడ్లు ఉన్నాయి. వీటిలో ఒక దొడ్డిలోని గొర్రెలు మాత్రం విచిత్రంగా వృత్తాకారంలో తిరుగుతున్నాయి.
దీనిపై మాట్ బెల్ స్పందిస్తూ.. ఒక దొడ్డిలో ఉండే గొర్రెల్లో ఒకటి రెండు గొర్రెలు మాత్రమే ఇలా ప్రవర్తిస్తాయని కానీ.. మందంతా ఇలా సర్కిల్స్ లో తిరగడం మాత్రం చాలా అరుదని చెప్పారు. ఏది ఏమైనా గొర్రెలు ఎందుకు వృత్తాకారంలో తిరుగుతున్నాయనే విషయం తెలియడంతో.. ఎలాంటి ప్రమాదం లేదని చైనీయులు ఊపిరి పీల్చు కుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.