ఆర్ ఆర్ ఆర్ రాజీనామా చేయ‌డు.. వైసీపీ స‌స్పెండ్ చేయ‌దు.. ఇదంతే!

Update: 2022-02-01 12:30 GMT
ఏపీ అధికార పార్టీ, ఆ పార్టీ పార్ల‌మెంటు స‌భ్యుడు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ కు మ‌ధ్య చోటు చేసుకున్న రాజ‌కీయ వివాదం.. మాట‌ల తూటాలు... వంటి విషయాలు అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను రాజీనామా చేయాల‌ని.. పార్టీ కీల‌క నేత‌లు ఆది నుంచి కోరుతున్నారు. అయితే.. ఆయ‌న రాజీనామా చేయ‌లేదు. ఇక‌, తామే వేటు వేయిస్తామ‌ని.. వైసీపీ నాయ‌కులు ప్ర‌తిజ్ఞ చేశారు. అనుకున్న‌ట్టుగానే.. పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు అన‌ర్హ‌త వేటు వేయాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం సాగుతోంది.

అయితే.. ఈ విష‌యంలో పార్ల‌మెంటు స్పీక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ తేల్చ‌లేదు. ఇటీవ‌లే.. ఈ అన‌ర్హత పిటిష‌న్ ప్రివిలేజ్ క‌మిటీకి చేరింద‌ని.. తెలిసింది. ఇదిలావుంటే.. వేటు వేయించక‌పోతే...త‌నే రాజీనామా చేస్తాన‌ని.. కొన్ని రోజుల కింద‌ట‌.. ఆర్ ఆర్ ఆర్ ప్ర‌క‌టించారు. దీనికి గాను ఆయ‌న ఫ్రిబ్ర‌వ‌రి 5ను ముహూర్తంగా పెట్టుకున్నారు.త ర్వాత దీనిని 7కు మార్చుకున్నారు. మ‌రోవైపు.. ఇంత జ‌రుగుతున్నా... వైసీపీ మాత్రం ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉన్నా... స‌స్పెండ్ మాటే ఎత్త‌గ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇది పిల్లి ఎలుక పోరుగా మారింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

నిజానికి పార్టీలో ఆర్ ఆర్ ఆర్ వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి?  నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌మాటే చెల్లు బాటు కావాల‌ని.. ఎంపీ.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు.. త‌మ మాట విన‌నాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం ద‌గ్గ‌ర‌.. వ‌చ్చిన వివాదం.. చినికిచినికి గాలివాన‌గా మారిపోయింది. దీంతో సీఎంతో ఒక ద‌ఫా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే.. దీనిని విభేదించిన ర‌ఘురామ‌.. త‌న రేంజ్‌లో విమ‌ర్శ‌లు సంధించ‌డం.. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు పిటిష‌న్లు వేయ‌డం తెలిసిందే. మ‌రోవైపు... ప్ర‌బుత్వ ప‌థ‌కాలు. సీఎం జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాలు.. ఆయ‌న ఖ‌ర్చులు ఇలా ..అన్నింటినీ రోడ్డున ప‌డేశారు.

ఇదే స‌మ‌యంలో స‌ర్కారు కూడా ర‌ఘురామ‌ పై కేసులు పెట్టింది. ఆయ‌న‌ను కొట్టించార‌ని కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇంత జ‌రిగితే... ర‌ఘురామ మాత్రం తాన‌ను పార్టీని ఏమీ అన‌లేద‌ని.. ప్ర‌భుత్వాన్ని మాత్ర‌మే విమ‌ర్శించాన‌ని.. పార్టీకి మాత్రం తాను విన‌య‌ విధేయ రాముణ్నేన‌ని చెబుతున్నారు. అయితే.. వైసీపీ మాత్రం ఆయ‌న‌ను అన‌ర్హుడిన‌ని చేస్తామ‌ని చెబుతోంది.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అటు ర‌ఘురామ కానీ.. ఇటు వైసీపీ కానీ.. చెప్పిన‌ట్టు ఏమీ చేయ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అటు తానే రాజీనామా చేస్తాన‌న్న ర‌ఘురామ రాజీనామా చేయ‌రు. ఇటు.. వైసీపీ ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌దు. దీంతో వీరిద్ద‌రి వివాదం.. ఇటు మీడియాకు రేటింగ్ పెంచుతుంటే... ప్ర‌జ‌ల‌కు మాత్రంత‌ల‌నొప్పిగా మారింద‌ని అంటున్నారు. 
Tags:    

Similar News