ఊహించని రీతిలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె మరో స్థాయికి వెళుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కోపాన్ని పట్టించుకోకుండా తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తున్న తీరుకు మద్దతు ఇస్తున్న గళాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇది.. తెలంగాణను దాటి విదేశాలకు పాకటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో సేవ్ ఆర్టీసీ పేరుతో అక్కడి తెలంగాణవాదులు నినాదాలు చేయటం.. వారిని బుజ్జగించే సమయంలో టీఆర్ఎస్ నేతల స్పందనతో మరింతగా మండిపోయిన తీరు.. ఇష్యూను సీరియస్ గా మార్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చి ఇప్పుడు వైరల్ గా మారింది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ.. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయిన వినోద్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతున్న వేళ.. ప్రవాస తెలంగాణీయులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. ప్లకార్డులు చేతపట్టుకొని.. సేవ్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేయటంతో వినోద్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటివరకూ దేశం కాని దేశంలో ఈ తరహా నిరసన టీఆర్ఎస్ నేతలకు ఎదురైంది లేదు. దీంతో.. వారు ఇబ్బందికి గురయ్యారు.