అశ్వత్థామ రెడ్డి కి సెలవు ఇవ్వడానికి నిరాకరించిన ఆర్టీసీ ..!

Update: 2019-12-21 05:20 GMT
అశ్వత్థామ రెడ్డి.. ఒక నెల క్రితం వరకు, అతను ఆర్టీసీ యూనియన్ల జెఎసి కి అధిపతి మరియు రాజకీయ నాయకుల నుండి మీడియా వరకు అందరూ అతని చుట్టూ ఉన్నారు. చారిత్రాత్మక 56 రోజుల ఆర్టీసీ ఆందోళన కు ఆయన కేంద్ర బిందువు గా ఉన్నారు. కానీ, ఈ రోజు, అయన గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఆర్టీసీ సమ్మె ముగిసిన తరువాత  ఏ నాయకుడూ అతన్ని పిలవ లేదు అలాగే , మీడియా కూడా పూర్తిగా పక్కన పెట్టేసింది.  

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి లీవ్ అప్లికేషన్ ను అధికారులు రిజెక్ట్ చేశారు. సమ్మె తర్వాత యూనియన్ లీడర్ల కు ఉన్న లీవ్ రిలీఫ్ ను అధికారులు క్యాన్సిల్ చేశారు. టీఎంయూ కార్యాలయాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో అశ్వత్థామ రెడ్డితో సహా లీడర్లంతా రిపోర్ట్ చేశారు. ఆ వెంటనే సెలవులు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు లీవ్ కావాలని కోరారు.  కానీ , సంస్థ ఆర్థికం గా నష్టాల్లో ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి సేవలు అవసరం. అందుకే లీవ్ క్యాన్సిల్ చేస్తున్నాం.  వెంటనే రిపోర్ట్ చేయండి’ అని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 6వ తేదీనే జారీ చేయగా, శుక్రవారం బయటకు వచ్చింది. అయితే, అశ్వత్థామ రెడ్డి మాత్రం ఇంకా విధుల కు హాజరు కాలేదు.
Tags:    

Similar News