జ‌గ‌న్ సింగిల్ మాట‌!... ఆర్టీసీ స‌మ్మె ర‌ద్దైంది!

Update: 2019-06-12 09:14 GMT
వైసీపీ అధినేత‌, న‌వ్యాంధ్ర‌కు నూత‌న సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో త‌న‌దైన మార్కును చూపిస్తున్నారు. సీఎంగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత వ‌రుస‌గా ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేసిన జ‌గ‌న్‌... త‌న కేబినెట్ తొలి స‌మావేశంలోనే వాటన్నింటికీ ఆమోద ముద్ర వేసేశారు. ఇక రేప‌టి నుంచి స‌మ్మె బాట ప‌ట్ట‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌క‌టించిన ఆర్డీసీ కార్మికులు... జ‌గ‌న్ నోట నుంచి వెలువ‌డిన సింగిల్ మాట‌తో స‌మ్మెను ర‌ద్దు చేసుకున్నారు. అంతేకాకుండా కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క మాట‌తో ఆర్టీసీ స‌మ్మెను విర‌మింప‌జేసిన జ‌గ‌న్ చాతుర్యంతో ఆర్డీసీ కార్మిక సంఘాలు ఫిదా అయ్యాయి.

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉండ‌గానే ఆర్టీసీ కార్మికులు స‌మ్మె నోటీసు ఇచ్చారు. అయితే అప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌న్న కోణంలో అస‌లు ఆ విష‌యాన్నే ప‌ట్టించుకునేందుకు స‌సేమిరా అన్న చంద్ర‌బాబు వైఖ‌రితో కార్మికులు ఆగ్ర‌హంగ‌తో ఊగిపోయారు. ఈ క్ర‌మంలో ఈ నెల 13 నుంచి స‌మ్మెలోకి వెళుతున్న త‌మ ప్ర‌క‌ట‌న‌ను ఎంత‌మాత్రం వెన‌క్కు తీసుకోవ‌డం లేద‌ని కూడా కార్మిక సంఘాలు ప్ర‌క‌టించాయి. అయితే ఏపీకి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే ప‌లు కీలక అంశాల‌తో పాటు ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన స‌మ్మె నోటీసుపైనా జ‌గ‌న్ దృష్టి సారించారు. అంతేకాకుండా పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌న్న త‌న హామీకి అనుగుణంగా మొన్న‌టి కేబినెట్ భేటీలో జ‌గ‌న్ సూత్ర‌ప్రాయ ఆమోదం కూడా తెలిపారు.

అయితే ఎలా వెళితే... ఆర్టీసీ సంస్థ ప్ర‌భుత్వంలో విలీనం ఈజీ అవుతుంద‌న్న విష‌యంపై అధ్య‌య‌నం చేసేందుకు ఓ క‌మిటీని వేశారు. ఈ క‌మిటీ త్వ‌ర‌లోనే త‌న ప‌ని ప్రారంభించ‌నుంది. ఇదిలా ఉంటే... రేపు స‌మ్మె మొద‌లుపెట్టేందుకు సిద్ధ‌మైన ఆర్టీసీ కార్మికులు నేడు సీఎం జ‌గ‌న్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ వారితో ఒకే ఒక్క మాట చెప్పార‌ట‌. ఆర్టీసీ బాధ్య‌త‌ను తాను తీసుకుంటున్నాన‌ని, స‌మ‌స్య ప‌రిష్కారంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్క‌ర్లేద‌ని జ‌గ‌న్ చెప్పార‌ట‌. ఈ ఒక్క మాట‌తోనే కార్మిక సంఘాల నేత‌లు ఫిదా అయిపోవ‌డంతో పాటుగా అక్క‌డిక‌క్క‌డే స‌మ్మెను విర‌మించుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. మొత్తంగా జ‌ఠిలంగా మారిన ఆర్టీసీ స‌మ్మెను జ‌గ‌న్ ఒక్క‌టంటే ఒక్క మాట‌తో ర‌ద్దయ్యేలా చేశార‌న్న మాట‌.


Tags:    

Similar News