అమ్మ కాళ్లను తీశారన్నది అబద్ధమేనట

Update: 2017-02-04 04:37 GMT
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి.. అమ్మ జయలలిత మృతిపై ఉన్న సందేహాలు అన్నిఇన్ని కావు. వీటికి తోడు.. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఊహాగానాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ప్రముఖంగా వినిపించిన ఊహాగానం..అమ్మకు నిర్వహించిన చికిత్సలో భాగంగా ఆమె రెండు కాళ్లను తొలగించారన్నది. ఎలా పుట్టుకు వచ్చిందో కానీ.. ఈ మాట.. జనాల్లోకి బలంగా వెళ్లింది. అమ్మ కాళ్లను తొలగించారా? అన్న విషయాన్ని చాలామంది నిజమేనని నమ్మే పరిస్థితి.

అయితే.. ఇలాంటి మాటల్లో నిజం అస్సలు లేదని.. ఇదంతా అబద్ధమేనని స్పష్టం చేస్తున్నారు అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ సి.ప్రతాప్ రెడ్డి. అమ్మ మృతిపై వస్తున్న అనుమానాలు.. ఊహాగానాల్ని కొట్టిపారేసిన ఆయన.. చికిత్సలో భాగంగా అమ్మకు కాళ్లను తొలగించినట్లుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన తేల్చేశారు.

అమ్మకు తాము చేసిన చికిత్సకు సంబంధించిన వివరాలన్నీ ఇప్పటికే బహిర్గతం చేశామని.. ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి దాపరికం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అమ్మకు చేసిన చికిత్స మీద సీబీఐ దర్యాప్తు చేసినా.. అందుకు తగ్గ వివరాల్ని అందించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు. మరీ మాటలు ప్రజల్లో ఉన్నసందేహాలు ఎంత వరకు నివృతి అవుతాయన్నది ప్రశ్నలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News