ఆగమాగం.. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి పూర్తి చేసిన రష్యా

Update: 2020-08-15 16:30 GMT
ఆగమాగం.. జగన్నాథం అన్నట్టుగా ఆదరబాదరగా ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ ను రిలీజ్ చేసింది రష్యా దేశం. రెండు క్లినికల్ ట్రయల్స్ చేసి విజయవంతంగా పనిచేస్తుందని తెలిపింది. అయితే మూడు ట్రయల్స్ చేయకుండానే మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడో ట్రయల్స్ లో వేలాది మందిపై ప్రయోగించి ఫలితాలు చూస్తారు. ఆ తరువాతే క్లిక్ అయితే విడుదల చేస్తారు.

తాజాగా రష్యా మొదటి బ్యాచ్ ఉత్పత్తిని పూర్తి చేసినట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టు తెలిపిన కొన్ని గంటలకే మొదటి బ్యాచ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పూర్తి చేసినట్లు రష్యా ప్రకటించడం గందరగోళానికి దారితీస్తోంది.

ఇలాంటి వేగవంతమైన వ్యాక్సిన్ ఉత్పత్తి వల్ల డేంజర్ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచదేశాల కన్నా ముందే వ్యాక్సిన్ తయారీ చేయాలన్న తొందరలో రష్యా భద్రతను పట్టించుకోవడం లేదని.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతోందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు.

అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ‘స్పుత్నిక్ వి’ పేరుతో రిలీజ్ చేసి కరోనా వ్యాక్సిన్ సురక్షితమని.. తన కుమార్తెకు కూడా ఇచ్చానని ఈనెల 11న కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేశారు.
Tags:    

Similar News