తీపికబురు: మార్కట్ లోకి రష్యా వ్యాక్సిన్

Update: 2020-09-24 17:43 GMT
కరోనా వైరస్ నియంత్రణకు అభివృద్ధి చేసిన రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రష్యాలోని ఆ దేశ ప్రజలకు సరఫరా చేసేందుకు మంగళవారం అందుబాటులోకి వచ్చిందని రష్యాన్ మీడియా వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్ సరఫరాలను త్వరలో ప్రారంభిస్తామని గత వారం రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రజా సరఫరాల కోసం కోవిడ్-19 వ్యాక్సిన్ బ్యాచ్ లు సిద్ధమయ్యాయని.. పలు ప్రాంతాలకు వాటిని త్వరలో తరలిస్తామని వెల్లడించింది.

వైరస్ ముప్పు ఉన్న గ్రూపులు, ఉపాధ్యాయులు వైద్యులకు ముందుగా వ్యాక్సినేషన్ చేపడుతామని రష్యా ఆరోగ్య మంత్రి మైఖేల్ మురష్కో ఇప్పటికే వెల్లడించారు.

వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ ను ముందుకు తీసుకువస్తామని రష్యా ముందు నుంచి చెబుతున్న విధంగానే స్పుత్నిక్ వీని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పై రష్యాలో 40000 మందిపై ప్రస్తుతం మూడో దశ పరీక్షలు కొనసాగుతున్నాయి. రాబోయే వారాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పరీక్షలు భారత్ లో చేపట్టనున్నారు.
Tags:    

Similar News