ఆ రెండు రాళ్లతో అతడు ఏకంగా కోట్లకు పడగలెత్తాడు...

Update: 2020-08-06 00:30 GMT
'కష్టపడి కనీసం నాలుగు రాళ్ళైనా వెనకేసుకోవాలి' అనేది ఒకప్పటి మాట. పూర్వకాలంలో నగదు చలామణి లేని కాలంలో రత్నాలు, బంగారం, వజ్రాలు మారకానికి ఉపయోగించేవారు. అప్పట్లో విరివిగా రంగు రాళ్లు అంటే వజ్రాలు దొరికేవి. అందుకే నాలుగు రాళ్లయినా వెనకేసుకోవాలని అంటుంటారు. రాను రాను తర్వాతి కాలాల్లో ఆ రంగు రాళ్లు దొరకడం ఆగిపోయింది. కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో ఇప్పటికీ తొలకరి చినుకులు పడ్డ సమయంలో చిన్న రంగురాళ్లు దొరుకుతుంటాయి. అయితే అవి రూ.వేలకే అమ్ముడు పోతుంటాయి. కానీ ఇప్పటికీ కోట్లు పలికే వజ్రపు రాళ్లు దొరకాలంటే మాత్రం ఆఫ్రికా ఖండానికి వెళ్లాల్సిందే. ఆఫ్రికాలోని ఉగాండా, నైజీరియా, టాంజానియా వంటి దేశాల్లో ఇప్పటికీ వజ్రాలు దొరుకుతుంటాయి. గనులకు లైసెన్స్ పొంది రోజువారీ కూలీలను పెట్టి నిరంతరం తవ్విస్తుంటారు. ఆ రాళ్ళ కోసం నిరంతరం తవ్వకాలు జరుపుతుంటారు. విలువైన వజ్రాలు మాత్రం అరుదుగా దొరుకుతుంటాయి. ఇటీవల టాంజానియాలో దొరికిన అరుదైన వజ్రపు రాళ్లు ఓ వ్యక్తి జీవితాన్నే మార్చాయి. సానినూ లైజర్ అనే వ్యక్తి నిర్వహించే గనిలో చాలా అరుదైన రెండు టాంజనైట్ వజ్రపు రాళ్లు దొరికాయి. అందులో ఒకటి 9.2కిలోలుండగా, మరొకటి 5.8 కిలోలు. రకరకాల రంగుల్లో ఇవి మెరుస్తుంటాయి. వీటిని విక్రయించగా ఆశ్చర్యంగా రూ. 25 కోట్లు వచ్చాయి. దీంతో కేవలం రెండు రాళ్లతో సానినూ లైజర్ కోట్లకు పడగలెత్తాడు. ఇప్పుడు అతడి జీవితమే మారిపోయింది. కేవలం రెండు రాళ్ళు దొరికితే జీవితం ఇంతలా మారుతుందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News