రాజధాని తరలింపుపై శారద పీఠం కీలక ప్రకటన: ముహూర్తం ఖరారు చేయలే!
ఆంధ్రప్రదేశ్ రాజధానులుగా విశాఖపట్టణం - కర్నూలు - అమరావతి అని ప్రభుత్వం నిర్ణయం ఆ మేరకు చకచకా పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. పరిపాలన వ్యవహారాల రాజధానిగా విశాఖపట్టణం నిర్ణయించి అమరావతిలో ఉన్న కార్యాలయాలన్నీ తరలించాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. కాకపోతే అప్పటి నుంచి ఏవో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మహమ్మారి వైరస్ తీవ్రంగా ప్రబలి రాజధాని తరలింపు ఆగిపోయింది.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నా భారీగా సడలింపులు ఇవ్వడంతో రాజధాని తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే రాజధాని తరలింపునకు ముహూర్తం శారదాపీఠం ఖరారు చేసిందనే వార్తలు వినిపించాయి. దీనిపై ఓ ఆంగ్ల దినపత్రిక వార్తలు కూడా రాసింది. అక్టోబర్ 25వ తేదీన రాజధాని తరలింపు పనులు చేయాలని శారదాపీఠం ముహూర్తం నిర్ణయించినట్లు ఆ పత్రిక వార్తా కథనం ప్రచురించింది. మే 28వ తేదీన ఆ పత్రికలో ఆ కథనం ప్రచురితమవడం తో శారదాపీఠం స్పందించింది. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆ మేరకు నిర్ణయించినట్లు ఆ పత్రిక వార్త రాసింది. అయితే ఇది అవాస్తవమని చెబుతూ శారదాపీఠం ఆ వార్తను ఖండించింది. తాము రాజధాని తరలింపుపై ఎలాంటి ముహూర్తం ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం విశాఖ శారదాపీఠం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజధాని తరలింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం తమతో సంప్రదింపులు చేయలేదని శారదాపీఠం వెల్లడించింది.