ఏటీఎంలో 2వేల నోటు రాదు ఎస్ బీ ఐ నిర్ణయం

Update: 2019-10-07 08:00 GMT
దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోటును ఇలా విడుదల చేయడం.. అలా దాచేయడం జరుగుతోందట.. భారీ కరెన్సీ కావడంతో బడాబాబులు, కొందరు బ్లాక్ మార్కెట్ గాళ్లు ఈ రెండు వేల నోట్లను తీసుకొని బ్లాక్ చేసేస్తున్నారు. వాటితోనే నల్లధనాన్ని కాపాడుకుంటున్నారు. దీంతో మార్కెట్లో రెండు వేల నోట్లు దొరకడమే ఆలస్యం మాయమైపోతున్నాయని ఆర్బీఐ గుర్తించిందట..అందుకే ఇప్పుడు ఏటీఎం నగదు లావాదేవీల్లో రూ.2వేల నోటు రాకుండా చర్యలు చేపట్టింది.

తాజాగా ఆర్బీఐ ఆదేశాల మేరకు దేశంలోనే నంబర్ 1 బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏటీఎంల నుంచి రూ.2వేల నోటు రాకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు రూ.2వేల నోట్లు పెట్టే క్యాసెట్లను తన ఏటీఎంల నుంచి తొలగించింది.

ఇక మున్ముందు రూ.500 నోటును కూడా ఆపేసి.. కేవలం రూ.100, రూ.200 నోట్లతోనే ఏటీఎంల లావాదేవీలు జరిగేలా చూసేందుకు ఎస్బీఐ చర్యలు చేపడుతోంది.

అయితే చిన్ననోట్లు మాత్రమే లభ్యమైతే వినియోగదారులకు చాలా కష్టం. ఎందుకంటే నెలలో మెట్రో నగరాల్లో మూడు సార్లు, పట్టణాల్లో 5 సార్లు మాత్రమే ఉచిత ఏటీఎం లావాదేవీలకు చాన్స్. ఈ రూ.100, రూ.200 నోట్లు మాత్రమే వస్తే ఇబ్బందులు వస్తాయని.. నగరాల్లో ఏటీఎంల నుంచి తీసే ఉచిత లావాదేవీలను 10కి, పట్టణాల్లో 12 సార్లకు పెంచేందుకు ఆర్బీఐ రెడీ అయ్యిందట.
Tags:    

Similar News