10400 ఎత్తు: పాక్-చైనా బార్డర్లో ఎస్బీఐ సాహసం

Update: 2019-09-15 06:07 GMT
మన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కశ్మీరీల కోసం సాహసమే చేసింది. ఏకంగా సముద్ర మట్టానికి 10400 అడుగుల ఎత్తులో పాకిస్తాన్-చైనా  సరిహద్దుల్లో తన శాఖను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జమ్మూకశ్మీర్ ను విభజించి లఢక్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాని మోడీ కూడా కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామక వేత్తలు - సంస్థలను కోరారు.

దీంతో భారతీయ స్టేట్ బ్యాంక్ లఢక్ లోని నుబ్రా వ్యాలీలోని దీక్సిత్ ప్రాంతంలో ఈ బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది. దీన్ని ఎస్బీఐ చైర్మన్ రజినీష్ కుమార్ ప్రారంభించారు. ఈ నుబ్రా వ్యాలీ లోయ ప్రాంతం.. కేవలం ఆరువేల మంది మాత్రమే జనాభా ఉంటుంది. సుదూర ప్రాంతమైన ఈ ప్రాంతం భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని లెహ్ లోని తుర్ తుక్ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇక చైనా సరిహద్దుల్లో గల సియాచిన్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మిగత బ్యాంకులు కనీసం ఈ ప్రాంతంలో శాఖను ఏర్పాటు చేయడానికి కూడా సాహసించని పరిస్థితుల్లో ఎస్బీఐ ధైర్యంగా ముందుకెళ్లడం విశేషం.

పాకిస్తాన్ - చైనా సరిహద్దుల్లో ఉగ్రవాద చాయలు ఉండే సూదూర కొండ ప్రాంతంలో ఎస్బీఐ ఇలా కశ్మీరీలకు బ్యాంకింగ్ సేవలను అందించి ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ఈ శాఖను ఏర్పాటు చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Tags:    

Similar News