నెట్టింట్లో చుక్కలు చూపిస్తున్న ఎస్ బీఐ

Update: 2015-12-23 05:47 GMT
32 దేశాల్లో కార్యాకలాపాలు.. 22 వేలకు పైగా బ్రాంచీలు.. వేలాది మంది ఉద్యోగులు.. కోట్లాది మంది కస్టమర్లతో పాటు.. దేశీయ బ్యాకింగ్ రంగంలో ‘కింగు’లాంటి ఎస్ బీఐ.. ఆన్ లైన్ బ్యాకింగ్ విషయంలో తన వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. గడిచిన పది రోజులుగా ఈ బ్యాంకుకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ సైట్ రెస్పాన్స్ దారుణంగా ఉండటంతో.. ఆన్ లైన్ కార్యకలాపాలకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తోంది. వెబ్ సైట్ సరే.. మొబైల్ లోయాప్ ద్వారా కార్యకాలపాల నిర్వహణ చాలా కష్టంగా మారింది. వెబ్ సైట్లో ఏదైనా కార్యకలాపాలు చేసేందుకు ప్రయత్నిస్తే.. ఎంతకూ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువమంది ఆన్ లైన్ లో బిల్లుల చెల్లిస్తున్న పరిస్థితి. చెల్లింపులు మాత్రమే కాదు.. ఆన్ లైన్ కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. గతంలో మాదిరి బ్యాంకులకు వెళ్లి.. లైన్ లో నిలుచోవటం లాంటివి బాగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. వెబ్ సైట్ ఏ మాత్రం సరిగా పని చేయకున్నా.. తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిందే. సాంకేతిక సమస్యలు మామూలే అయినా.. బ్యాంకింగ్ రంగంలాంటి కీలకమైన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా అనుకోని ఇబ్బంది ఎదురైనా గంటల వ్యవధిలో ఫిక్స్ చేస్తారు. అందుకు భిన్నంగా పది రోజులుగా ఎస్ బీఐ ఆన్ లైన్ కార్యకలాపాలు ఇబ్బందిగా మారాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆన్ లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక.. వినియోగదారులకు ఎలాంటి నొప్పి తెలీకుండా కంపెనీలు వ్యవహరిస్తుంటాయి. ఇక.. బ్యాంకింగ్ లాంటి రంగాల విషయానికి వస్తే.. యూజర్ కి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. ఇందుకు భిన్నంగా ఎస్ బీఐ వ్యవహారం సాగుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.

ఎస్ బీఐ ఆన్ లైన్ లో కార్యకలాపాలకు ఎందుకింత ఇబ్బంది ఎదురవుతుంన్న? అని ప్రశ్నకు ఆయా వర్గాలు చెబుతున్న సమాధానం చూస్తే.. ప్రస్తుతం తాము అనుసరిస్తున్న ఆన్ లైన్ వ్యవస్థను మరింత రక్షణాత్మకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని .. ఒకట్రెండు రోజుల్లో ఈ సమస్య పూర్తిగా సమిసిపోతుందని అనధికారికంగా చెప్పటం విశేషం. ఈ నేపథ్యంలో.. ఎస్ బీఐ ద్వారా ఆన్ లైన్ లో కార్యకలాపాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరి నిమిషం వరకూ ఆగకుండా వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం లేదంటే.. ఇబ్పందులు తప్పవనే చెప్పాలి. సో.. ఎస్ బీఐ ఇష్యూలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి సుమా.
Tags:    

Similar News