వైట్ హౌస్ లో రెండో కరోనా కేసు..ట్రంప్ సహాయకుడికి పాజిటివ్!

Update: 2020-05-09 06:50 GMT
అమెరికా అధినేత  డొనాల్డ్ ట్రంప్ నివసించే వైట్ హౌస్‌ లో కరోనా కలకలం రేగింది. తాజాగా వైట్ హౌస్ లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అమెరికాలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైట్ హౌస్ లో పనిచేసే అమెరికా మిలటరీ సిబ్బందికి కోవిడ్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఆ వ్యక్తి అధ్యక్షుడు ట్రంప్ పర్సనల్ స్టాఫర్ అని సమాచారం. ఆయనతో దగ్గరగా మెలిగిన వారందరినీ క్వాంరటైన్ చేసి పరీక్షలు చేశారు. అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ కు కూడా కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. రిపోర్టుల్లో వీరిద్దరికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.

తన పర్సనల్ స్టాఫ్‌ కు కరోనా వైరస్ సోకడంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కలత చెందారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలియజేశారు. వైరస్ సోకిన వ్యక్తి అప్పుడప్పుడూ ట్రంప్‌ కు భోజనం వడ్డించేవారని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే వైట్ హౌస్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో అక్కడ వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయాలని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే వైట్ హౌస్ లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆదేశించారు.

కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 1,322,163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడి 223,749 మంది కోలుకోగా... 78 వేల మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 1,019,798 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 16,978 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కరోనా గణాంకాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News