తహసీల్దార్ హత్య కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు సిబిఐ కి డిమాండ్ చేసిన భర్త

Update: 2019-11-05 09:48 GMT
అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. పట్టపగలు .. ఆఫీస్ లోకి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అతి కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణమైన చర్య వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వివాదాస్పద భూములు..పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవటం.. రాజకీయ ప్రముఖుల కళ్లు ఆ భూముల మీద పడటం వంటి అంశాలు రక రకాలుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ హత్య వెనుక కారణాలు ఏమైనప్పటికీ.. ఈ అమానుష సంఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

విజయారెడ్డి మొదటి నుండి కూడా చాలా దైర్యం ఉన్న ఉద్యోగిని కావడంతో ఎవరి ఒత్తిళ్లకు భయపడేది కాదు. తన పని తాను చేసుకొని వెళ్లిపోయేది. ఇదే చివరికి ఆమె ప్రాణాల మీదకి తెచ్చింది. ఆమె పనిచేసే పరిధిలో  మొత్తంగా 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. 1990 నుండి వివాదంలో ఉన్న భూముల విషయంలో కొందరు అధికారులకి బెదిరించి తమ పేరుపైకి మార్పిడి చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.

256643.హాటముల్  కాగా.. వివాదాస్పద భూముల వ్యవహారంలో ఒక రాజకీయ ప్రముఖుడితో సహా.. రంగారెడ్డి.. మేడ్చల్‌ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. కోట్లు ప‌లికే భూమిపై త‌మ‌కూ హ‌క్కుంద‌ని సురేష్ అనే వ్య‌క్తి.. ఓ ఎమ్మెల్యే వ‌ద్ద‌కు వెళ్లాడు. ల‌క్ష‌లు కుమ్మ‌రించాడు. ప‌ని జరగక‌పోవ‌టం వ‌ల్ల ఎమ్మెల్యే తానే స్వ‌యంగా త‌హ‌సీల్దార్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె త‌న‌ను అక్క‌డ నుంచి బ‌దిలీ చేయ‌ట‌మంటూ రంగా రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోరింది. ఇదీ ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారం.

ఎమ్మెల్యే మాటలకి  కూడా విజయారెడ్డి తలొగ్గకవడంతో  సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశానని, ఆమె స్పందించకపోవడంతో తిరిగి పెట్రోలు డబ్బాతో కార్యాలయానికి వెళ్లానని చెప్పాడు మొదట తనపై పోసుకొని, తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగలబెట్టేశారు.ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌, అటెండర్‌ కూడా  తీవ్ర గాయాలపాలయ్యారు. 80 శాతానికి పైగా గాయాలైన డ్రైవర్ ప్రాణాలతో పోరాడి ఈ రోజు తుదిశ్వాస విడిచాడు.  వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోను అగ్నికి ఆహుతి చేశానని నిందితుడు సురేశ్‌ చెప్పాడు. సోమవారం 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేశ్‌ వాంగ్మూలం ఇచ్చాడు.

ఈ  సమయంలో విజయారెడ్డి భర్త సైతం కీలక ఆరోపణలు చేసారు. ఆమె హత్యకు సురేష్ ముదిరాజ్ ఒక్కడే కారణం కాదు. ఈ హత్య వెనుక ఇంకా చాలా మంది హస్తం ఉంది అని , ఉద్యోగ రీత్య తనపై ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు ఉన్నట్టు చెప్పలేదని . హత్య చేయాల్సినంత ఘోరం తన భార్య చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గౌరెల్లి, బాచారం తదితర ప్రాంతాల్లోని భూముల వివాదమే విజయారెడ్డి హత్యకు కారణమని మీడియా లో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయారెడ్డి హత్య వెనుక ఉన్న  వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

దీనితో  ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సురేష్ ఫోన్ కాల్ డేటాపై దృష్టి పెట్టి.. ఎవరి నుంచి ఫోన్‌లు వచ్చాయి.. సురేష్ ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్లాయి. హత్యకు ముందు ఎవరితో మాట్లాడారు? హత్యకు సురేష్‌ను ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ..

ఈ  కేసులో నిందితుడు సురేష్ మ‌తిభ్ర‌మించిన వ్య‌క్తిగా ప్ర‌చారం సాగుతుంది. అత‌డి త‌ల్లి కూడా తన కొడుకు అమాయ‌కుడు అని చెప్తుంది. కానీ విసిగిపోయిన సురేష్ హ‌త్య‌కు ప‌క్కాగా ప్రణాళిక రచించాడు. పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత చనిపోయిన‌ట్టు నిర్ద‌ార‌ణకు రాగానే పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే సురేష్ కి మతి భ్రమించలేదు అని తెలుస్తోంది. ఇప్పటికే దీని పైన ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తుంది. అలాగే  పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తుండంతో అతి  త్వరలోనే అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News