మహారాష్ట్ర లో సంచలనం.. బీజేపీ తో ఎంఎన్ఎస్..

Update: 2020-01-08 04:36 GMT
మహారాష్ట్ర లో బీజేపీ ఒంటరి అయిపోయింది. మిత్రుడు శివసేన హ్యాండ్ ఇవ్వడం తో  అధికారం కోల్పోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. శివసేన అధికారం కోసం హిందుత్వ ఎజెండాను పక్కన పెట్టి సెక్యులర్ కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి మహారాష్ట్ర లో గద్దెనెక్కింది.

ఇప్పుడు మహారాష్ట్ర లో హిందుత్వ ఎజెండాతో ఉన్న బీజేపీకి అనుకోని అతిథి జత కట్టాడు. మొన్నటి వరకు బీజేపీ అన్నా మోడీషాలు అన్న విరుచుకుపడ్డ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తాజాగా బీజేపీ మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటి కావడం మహారాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది.

శివసేనలో చీలికతో ఎంఎన్ఎస్ పుట్టింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సోదరుడే రాజ్ ఠాక్రే. వీరిద్దరూ విడి పోయాక శివసేన-బీజేపీతో పొత్తు ఉండడంతో రాజ్ ఠాక్రే వీరిపై నిప్పులు చెరిగారు. పోయిన 2014 ఎన్నికల్లో పోటీచేసి 13 సీట్లు కూడా రాబట్టాడు. కానీ ఈ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీచేసినా 1 స్థానమే గెలవడం తో రాజ్ ఠాక్రే పునరాలోచనలో పడిపోయారు. అందుకే ఇప్పుడు హిందుత్వను వీడి బీజేపీకి దూరమైన శివసేన ప్లేసును మహారాష్ట్ర లో భర్తీ చేయడానికి రెడీ అయ్యారు.

తాజాగా రాజ్ ఠాక్రే బీజేపీ అద్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటి కావడంతో మహారాష్ట్ర లో కొత్త పొత్తు పొడస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే పలు బీజేపీ పోస్టర్లు, ఫ్లెక్సీల్లో రాజ్ ఠాక్రే ఫొటో కూడా పెట్టడం తో వీరి బంధం బలపడడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్ ఠాక్రే బీజేపీతో కలవడంతో శివసేన ఉలిక్కిపడింది. మరి ఈ బంధం బలపడితే శివసేనకు కూడా ముప్పే..


Tags:    

Similar News