సంచలనంగా రఘురామ సర్వే.. టీడీపీకి 127.. వైసీపీకి ఎడెనిమిది

Update: 2022-08-23 04:05 GMT
తరచూ వార్తల్లో నిలిచే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మరోసారి సంచలన అంశాలతో మీడియా ముందుకు వచ్చారు. దీంతో.. ఆయన చెప్పిన సంగతులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు ఆయన చెబుతున్న మాటల్ని ఆసక్తిగా వింటున్నారు. తానో ప్రైవేటు సంస్థ ద్వారా ఎన్నికల సర్వే చేయించామన్నారు.యాప్ ద్వారా చేయించిన నేపథ్యంలో వచ్చిన ఫలితాల్ని ఆయన మీడియాకు వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ.. జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున శాంపిళ్లను శాస్త్రీయంగా జూన్ నుంచి జులై మొదటి వారం సర్వేను నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఈ  సర్వేలో తెలుగుదేశం పార్టీ 93 స్థానాల్లో కచ్ఛితంగా గెలుస్తుందన్న ఆయన.. నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న వాటిల్లో సగం స్థానాలు  గెలిచినా తెలుగుదేశం పార్టీకి 127 స్థానాలు వచ్చే వీలుందన్నారు.

ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సంచలన అంశాల్ని వెల్లడించారు. విపక్ష టీడీపీ విజయం సాధించే స్థానాల గురించి చెప్పిన రఘురామ.. అధికార వైసీపీ గురించి చెబుతూ.. ఎడెనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. మరో మూడు నుంచి నాలుగు స్థానాల్లో విజయవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. ఇంగ్లిషు మీడియా సంస్థలు చేసే సర్వేలను చూసి మురిసిపోతూ కూర్చుంటే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్న ఆయన.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

తాము చేపట్టిన సర్వే వివరాలు.. జిల్లాల వారీగా పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది రఘురామ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల్లో ఆసక్తికర అంశాల్ని చూస్తే..
-  టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి 56 శాతం ఓటింగ్ ఉంటే.. వైసీపీకి 34 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు.
-  టీడీపీ అగ్రనేతల్లో మరొకరు నారా లోకేశ్ పోటీ చేసే మంగళగిరిలో టీడీపీకి 50 శాతం.. వైసీపీకి 37 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. ఇదే స్థానం నుంచి 2019లో పోటీ చేసిన లోకేశ్ ఓటమిపాలు కావటం తెలిసిందే.

-  రాయలసీమలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ హవా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ.. జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. వార్ వన్ సైడే.
-  టీడీపీకి 90 స్థానాలకు పైనే విజయం సాధిస్తుంది. 127 సీట్ల వరకు వచ్చే వీలుంది. వైసీపీ పక్కాగా గెలిచేవి ఎడెనిమిది మాత్రమే. మరో మూడు-నాలుగుస్థానాల్లో విజయానికి ఛాన్సులు ఉన్నాయి.
-  నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న 65 స్థానాల్లో 90 శాతం సీట్లలో వైసీపీ విజయం సాధిస్తే 73 సీట్లకు పరిమితమయ్యే వీలుంది.

- ప్రకాశం జిల్లాలో వైసీపీ.. టీడీపీ మధ్య పోటాపోటీగా తలపడే అవకాశం ఉంది. అనంతపురంలో టీడీపీ మెజార్టీ స్థానాలు సొంతం చేసుకొని ఏకపక్ష విజయం ఖాయం.
-  ఉమ్మడి ఉభయ గోదావరి జిలలాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంది. గుంటూరు జిల్లాలో విజయవకాశాల్ని పవన్ ప్రభావితం చేస్తారు. నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న స్థానాల్లో టీడీపీ.. జనసేన రెండుపార్టీలు కలిసి పోటీ చేస్తే.. ఈ రెండు పార్టీల అభ్యర్థులు సులువుగా గెలుస్తారు.
Tags:    

Similar News