కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరాలి``-ఇదీ బీజేపీ నేతల సంకల్పం. ముఖ్యంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం. అప్పటికి కానీ.. సంపూర్ణంగా.. బీజేపీ ఉద్దేశిత సిద్ధాంతాలైన.. హిందూత్వ ను బలంగా నాటుకునేలా చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే.. అనేక మతాలు.. సంస్థలు.. సంఘాలు.. రాష్ట్రాల్లోకి తనదైన జోక్యంతో చొచ్చుకుపోయిన కేంద్ర ప్రభుత్వం(బీజేపీ) తన అజెండాను సంపూర్ణంగా అమలు చేస్తోంది. నిజానికి మన దేశం భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన దేశం. కానీ, మోడీ వచ్చిన తర్వాత.. దీని విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన ఉంది.
కేవలం హిందూత్వను చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. లౌకిక వాదిగా ప్రపంచ వేదికలపై పరువు నిలబెట్టుకుని.. తనకంటూ.. ఒక పేరు పఖ్యాతులు సాధించిన.. భారత్..ఈ రోజు.. లౌకికత్వం దెబ్బతినే పరిస్థితి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఒక దేశం.. ఒకే పన్ను.. ఒక దేశం.. ఒకే విధానం.. మాదిరిగా.. త్వరలోనే(మూడోసారి బీజేపీ వస్తే) ఒక దేశం.. ఒకే మతం! అనే నినాదాన్ని కూడా అందుకోవడం ఖాయమనే వాదన సర్వత్రావినిపిస్తుండడం గమనార్హం. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే!
తాజాగా కాశీని పునరుద్ధరించామని.. చెబుతున్న మోడీ.. నిజానికి కాశీలో ఇప్పటి వరకు విలసిల్లిన.. లౌకికత్వా న్ని దెబ్బతీశారని అంటున్నారు పరిశీలకులు. కాశీలో అన్ని మతాల వరకు ఉంటున్నారు. కలిసి మెలిసి జీవిస్తున్నారు. అంతెందుకు.. కాశీ విశ్వనాథుని.. సుప్రభాత సేవలో తొలి పలుకులు ముస్లింలవే! అలాంటి చోట అభివృద్ధి పేరిట.. ఇక్కడ నెలకొన్న అనేక మంది సంస్కృతులను చిన్నా భిన్నం చేశారనే వాదన బహిరంగంగానే వినిపిస్తుండడం గమనార్హం.
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. మోడీ వేసిన పాచికలో.. అంతిమంగా నాశనమైంది..లైకిక వాదమేనని అంటున్నారు పరిశీలకులు. మోడీ మరోసారి అధికారంలోకి వస్తే.. దేశం మొత్తాన్ని కాషాయీకరించడమో.. లేక ఒకే దేశం.. ఒకే మతం అనే నినాదాన్ని తీసుకురావడమో ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.