పాకిస్తాన్ క్రికెట్ లో వైరస్ కలకలం రేగింది. క్రికెట్ కి వీడ్కోలు చెప్పి తన స్వచ్చంద సంస్థ ద్వారా ఈ మధ్య కాలంలో సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్న మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీకి వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గురువారం నుంచి తనకు ఆరోగ్యం సరిగా లేదని, దాంతో టెస్ట్ చేయించుకోగా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన షాహిద్ అఫ్రిదీ.. ”గురువారం నుంచి నాకు ఆరోగ్యం సరిగా లేదు. శరీరమంతా ఎక్కువగా నొప్పులు ఉన్నాయి. టెస్ట్‌లో వైరస్ పాజిటివ్ గా తేలింది. నేను త్వరగా కోలుకునేందుకు దేవుడిని ప్రార్థించండి” అని అన్నారు. దీంతో మీరు త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా పాక్ లో ఇదివరకే క్రికెటర్లు తౌఫీగ్ ఉమర్, జాఫర్ సర్ఫరాజ్‌లు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ఆఫ్రిదీతో పాక్ లోవైరస్ బారిన పడిన క్రికెటర్ల సంఖ్య మూడుకు చేరింది. అఫ్రిదీకి వైరస్ పాజిటివ్ అని తేలడంతో అతని కుటుంబ సభ్యులకి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇకపోతే, ఈ వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో అఫ్రిదీ ఎంతోమంది నిరాశ్రయులకు సాయం చేశారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పలువురికి నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. అలాగే పాక్ లోని ఓ హిందూ దేవాలయంలోనూ అఫ్రిదీ నిత్యావరసర సరకులు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. అలాగే, కరోనా ఫండ్ రైజింగ్ లో భాగంగా మే నెల మొదట్లో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం బ్యాట్ ను ఆక్షన్ లో అఫ్రిది కొన్నాడు. ముష్ఫికర్ రహీంకు ఓ బయ్యర్ దొరికారు. మంచి కార్యక్రమంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ అఫ్రిది భాగమయ్యాడు. ఛారిటీ ఫౌండేషన్ తరఫున బ్యాట్ ను అఫ్రిది కొన్నాడు అని ఐసీసీ ట్వీట్ చేసింది.