షర్మిల 'అతి మాటలు' ఎక్కువయ్యాయా? కేసీఆర్ ని చెప్పుతో కొట్టాలి అనే పెద్ద మాట అవసరమా?
తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానంటూ.. ఊరూవాడా.. పాదయాత్ర చేస్తున్న ఏపీ సీఎం జగన్.. సోదరి.. దివంగత వైఎస్ తనయ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అధ్యక్షురాలు.. షర్మిలలో అసహనం కట్టలు తెగుతోం దని అంటున్నారు పరిశీలకులు. ఆమె పార్టీ పెట్టి.. నెలలు గడిచిపోయి.. ప్రధమ వార్షికోత్సవానికి చేరువ అవుతున్నా.. ఇప్పటివరకు పట్టుమని పది మంది మాజీ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ .. పార్టీలో చేరలేదు. అంతేకాదు.. ఉన్నవారుకూడా పోతున్నారు. ఆమె నాయకత్వంపై వారుప్రశ్నలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు... మరో ఏడాదిన్నరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ. ప్రత్యామ్నాయ పార్టీగా ఎవ రూ.. షర్మిల పార్టీని కానీ, ప్రత్యామ్నాయ రాజకీయ నాయకురాలిగా.. ఆమెను కానీ.. గుర్తించడం లేదు. దీంతో షర్మిలలో ఆవేశం.. ఆగ్రహం కూడా .. కట్టలు తెగుతోంది. అయితే.. దీనిని ఆమె కొంత వరకు తమాయించు కుంటున్నా.. తరచుగా మాత్రం తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే తీవ్ర విమర్శలు చేశారు. నిజానికి తను ఇప్పటికే.. విద్యార్థి ఉద్యమాలు.. నిరాహార దీక్షలు చేసినా.. మైలేజీ దక్కడం లేదు.
దీంతో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని.. వ్యాఖ్యలు చేస్తున్నారని.. అలా అయినా.. మీడియాలో వైరల్ అయ్యేందుకు ఫ్రంట్ పేజీలలో ఫొటోలు వేయించుకునేందుకు తహతహ లాడుతున్నారని.. అంటున్నా రు పరిశీలకులు. సరే.. తాజాగా జరిగిన విషయానికివస్తే.. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా జరిగిందని, పెట్టుబడి తగ్గించి రాబడి పెంచిన ఘనత వైఎస్ఆర్‌దేనని షర్మిల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన చేస్తున్న ఆమె మాట్లాడుతూ... రెండుసార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని సీఎం చెబుతున్నారని... మరి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. రూ.25 వేలు ఇచ్చే పథకాలు ఆపేసి రూ. 5 వేలు రైతుబంధు ఇస్తున్నారని విమర్శించారు. కౌలు రైతుకు రుణాలు, రైతుబంధు ఇవ్వడంలేదన్నారు. వరి పంట వేయొద్దని రైతులకు చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. వరి వేయని రైతులకు ముఖ్యమంత్రి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారని, మద్దతుధరతో పాటు బోనస్ కలిపి రైతులకు చెల్లించాలన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను ఎవరైనా ఏమైనా అంటే వరి కంకులతో కొట్టాలంటూ.. రాజేశ్వరరెడ్డి చెప్పారని, మరి తప్పులు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దేనితో కొట్టాలని ప్రశ్నించారు. వరి వేయొద్దన్న కేసీఆర్‌ను ఏ చీపురు, ఏ చెప్పులతో కొట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొడుకు అరాచకాలతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎమ్మెల్యే, ఆయన కొడుకుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు.
షర్మిల చేసిన.. చెప్పుతో కొట్టాలన్న వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నివ్వెర పోయింది. ఇలాంటి వ్యాఖ్యలు నీకు అవసరమా? మైలేజీ కోసం.. ఇంతగా దిగజారాలా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ సమస్యలపైనా.. రైతుల సమస్యలపైనా.. నీకున్న అవగాహన ఏంటని నిలదీస్తున్నారు. ఏదేమైనా... షర్మిల రాజకీయమే కాదు.. ఆమె మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. అన్నపై అలిగి.. పార్టీ పెట్టారని.. ఇప్పుడు పార్టీగా పుంజుకునే పరిస్థితి లేకపోవంతో సహనం కోల్పోతున్నారని అంటున్నారు.