అండర్ 19 ప్రపంచ కప్ జట్టు కెప్టెన్ గా సీనియర్ ప్లేయర్.. టీమిండియాలో భలే వెరైటీ
సీనియర్, జూనియర్, సబ్ జూనియర్.. ఏ క్రీడలోనైనా కనిపించే వయో వర్గాలివి. అండర్ 15 లోపు వారిని సబ్ జూనియర్లుగా పరిగణిస్తుంటారు ఎక్కువ శాతం. ఆపై వయసు వారిని జూనియర్ స్థాయిగా పేర్కొంటుంటారు. 20 ఏళ్లు ఆపై వయసు లేదా జాతీయ స్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించేవారిని సీనియర్లుగా భావిస్తారు. వీరు ఎక్కువశాతం 19 ఏళ్లు దాటినవారే అయి ఉంటారు. అత్యంత ప్రతిభావంతులైన ఒకటీ, అరా క్రీడాకారులు మాత్రమే టీన్స్ దశలోనే జాతీయ జట్టుకు ఎంపికవుతుంటారు. పురుషుల క్రికెట్ లో ఒక సచిన్ టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లి.. ఈ కోవలోకే వస్తారు. మహిళల క్రికెట్ లో చెప్పుకోవాలంటే అలాంటి క్రీడాకారిణి షెఫాలీ వర్మ.
17 ఏళ్లలోపే టీమిండియాలోకి
హరియాణకు చెందిన షెఫాలీ ప్రస్తుత వయసు సరిగ్గా 18 ఏళ్ల 312 రోజులు. మరో నెలన్నరలో 20వ ఏట అడుగుపెట్టనుంది. విచిత్రం ఏమిటంటే ఈమె ఇప్పటికే టీమిండియా తరఫున టెస్టులు, వన్డేలు, టి20లు ఆడింది. 2019 సెప్టెంబరులోనే అంతర్జాతీయ తొలి టీ20 ఆడింది. ఆపై గతేడాది జూన్ లో వన్డేలు, టెస్టుల్లో అరంగేట్రం చేసింది. సీనియర్ స్థాయిలో ఇంత అనుభవం ఉన్న షెఫాలీని తాజాగా టి20 ప్రపంచ కప్ జట్టు కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ.
దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటుగా ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించనుంది. శ్వేతా సెహ్రావత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా గోష్ సైతం జట్టులో స్థానం సంపాదించింది. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా తొలి ఎడిషన్‌లో 16 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరి 14 నుంచి 29 వరకు జరగనుంది. గ్రూప్- డిలో టీమ్‌ఇండియాతో పాటు దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్ ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి టాప్ 3లో నిలిచిన జట్లు సూపర్ 6 రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. ప్రతి గ్రూపు నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 27న జరగనున్న సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.
ఈ కుర్రది.. దూకుడున్నది
హరియాణలోని రోహ్ తక్ లో 2004 జనవరి 18న జన్మించిన షెఫాలీ వర్మ 2 టెస్టులు, 21 వన్డేలు, 46 టి20ల్లో సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అమ్మాయిల క్రికెట్ లో కనిపించే నిదానమైన ఆటకు భిన్నంగా దూకుడైన క్రికెటర్. సహజ సిద్ధంగా ఉత్తరాది అమ్మాయిలకు ఉండే వేగం షెఫాలీ సొంతం. ఒకవిధంగా చెప్పాలంటే లేడీ వీరేంద్ర సెహ్వాగ్ అనొచ్చు. షెఫాలీ ఒక్కసారి టచ్ లో వచ్చిందంటే ఆపడం ప్రత్యర్థి బౌలర్ల తరం కాదు. అయితే, ఈ ఊపులోనే అచ్చం సెహ్వాగ్ లా తొందరగా ఔటవుతుంటుంది. కానీ, మంచి భవిష్యత్ ఉన్న క్రికెటర్ గా షెఫాలీని చెప్పవచ్చు.
మరెవరూ లేరా?
షెఫాలీ ప్రతిభావంతురాలే. భారీ ఇన్నింగ్స్ లు ఆడగల సమర్థురాలే. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ, మూడేళ్లుగా సీనియర్ జట్టు సభ్యురాలైన షెఫాలీని అండర్ 19 ప్రపంచ కప్ జట్టు కెప్టెన్ గా చేయడమే విచిత్రం. వాస్తవానికి షెఫాలీ ఎప్పుడో సీనియర్ స్థాయి క్రికెటర్ గా మారిపోయింది. తన దూకుడేంటో విదేశీ జట్లకూ చూపింది.
అలాంటి క్రికెటర్ ను తీసుకొచ్చి అండర్ 19 కెప్టెన్ చేయడం గమనార్హం. అయితే, ఇందులో తప్పుబట్టేందుకు ఏమీ లేదు. షెఫాలీ వయసు ప్రకారం చూసినా ఆమె ఇంకా అండర్ 19 స్థాయి క్రికెట్ ఆడేందుకు అర్హురాలే. కాబట్టి తన విషయంలో బీసీసీఐ తెలివిని ఔరా అంటూ నోరెళ్లబెట్టి చూడాల్సిందే.