కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల నుంచి బరిలో దించుతోంది. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్తత స్థాయి చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించడంతోపాటు, నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని వైఎస్ జగన్ పార్టీ నేతలకు తెలియజేశారు. కాగా శిల్పా ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. టీడీపీలో ఉండగానే నంద్యాల టిక్కెట్ ను ఆయన ఆశించినా కూడా చంద్రబాబు నుంచి హామీ దొరక్కపోవడం.. మంత్రి అఖిల ప్రియ డామినేషన్ పెరగడంతో ఆయన పార్టీ మారిపోయారు.
మరోవైపు నంద్యాలకు ప్రాతినిధ్యం వహించిన భూమా నాగిరెడ్డి మరణించేనాటికి టీడీపీలో ఉన్నా కూడా ఆయన వైసీపీ నుంచే గెలిచిన వ్యక్తి కావడంతో వైసీపీ కూడా ఆ స్థానానికి అభ్యర్థిని నిలుపుతామని ముందే ప్రకటించింది. శిల్పా చేరికతో నంద్యాలకు ఆయనే సరైన అభ్యర్థిగా భావించిన పార్టీ ఈ రోజు ప్రకటన చేసింది. టీడీపీ నుంచి నాగిరెడ్డి సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డి బరిలో దిగుతుండగా శిల్పా ఆయనతో తలపడనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/