నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ ఉప ఎన్నికల హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. వేలాదిగా హాజరైన ప్రజానీకం మధ్యన నేతలు మనసు విప్పారు. మటలతో అధికారపక్షాన్ని కడిగేసిన నేతలు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. ఈ బహిరంగ సభలో మాట్లాడిన నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం భావోద్వేగాల మధ్య సాగింది.
నంద్యాల ఉప ఎన్నికలో సరికొత్త నినాదానికి.. కొత్త హామీకి తెర తీస్తూ శిల్పా మోహన్ రెడ్డి ప్రసంగం సాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్నారు. నంద్యాలలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని.. నంద్యాలను కానీ ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే అభివృద్ధి పథంలో దూసుకుపోతామన్నారు.
ఏపీ మంత్రి అఖిల ప్రియను తాను కొన్ని ప్రశ్నల్ని సంధిస్తున్నానని.. వాటికి ఆమె సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. సిటీకేబుల్ మీదే కదా.. నంద్యాలలో సాక్షి టీవీ ఎందుకు రావటం లేదన్న శిల్పా మోహన్ రెడ్డి.. ఐదేళ్లు టీవీ 9 ప్రసారాల్ని బంద్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ రోజు అనాధ బిడ్డల్ని ఆశీర్వదించమని బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారని.. మీ తండ్రిని ఎవరైనా చంపారా? .. మీ తండ్రి ఎంతమందిని అనాథలుగా చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరి.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఉప ఎన్నికలు వచ్చేసరికి నంద్యాల మీద చంద్రబాబు ప్రేమ ఒలకబోస్తున్నారని.. మరి.. ఇదే చంద్రబాబును దీబగుంట్ల వద్దకు వచ్చినప్పుడు రోడ్ల విస్తరణ గురించి అడిగానని.. డబ్బులు లేవన్నారన్నారు. ఆ రోజు డబ్బులు లేవని చెప్పిన చంద్రబాబు.. ఈ రోజు ఉప ఎన్నిక ఉండటంతో హడావుడిగా రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టారన్నారు.
టీడీపీ మైనార్టీ నేత ఫరూక్ ముస్లింల వద్ద తనపై విష ప్రచారం చేస్తున్నారని.. కానీ వారికి తోడుగా ఉంటూ.. ఎన్నో షాదీఖానాలు.. మసీదుల్ని నిర్మించానన్నారు. శిల్పా సోదరులు ఏ ముస్లిం సోదరుడిని అవమానించలేదని.. తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.
కరీం - ఇస్సాక్ - మగ్బుల్ - చాంద్ వంటి పెద్దలు ఉన్నారని.. అప్పట్లో రౌడీషీట్ ఇష్యూలో బెయిల్ ఇప్పించింది తానేనన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ఎంపీ ఎస్పీవై రెడ్డి.. ఫరూక్ ఊళ్లో ఉండి కూడా ముస్లింలను పలుకరించేందుకు స్టేషన్ కు వెళ్లలేదని.. ఆ రోజు ఊళ్లో లేకపోవటంతో తాను పలుకరించలేకపోయానన్నారు. తాను ముస్లింలను ఎప్పుడూ అగౌరవపర్చలేదని.. ఒకవేళ ఏదైనా చిన్న గాయం చేసినా తనను మనస్ఫూర్తిగా క్షమించాలన్నారు. రాజకీయాల కోసం కులాల్ని.. మతాల్ని వాడుకోవద్దని తాను టీడీపీ నేతల్ని కోరుతున్నట్లుగా చెప్పారు. తమకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్షను ప్రసాదించారని.. తమ ఊపిరి ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబం కోసం.. నంద్యాల ప్రజల కోసం ప్రాణాల్ని ఆర్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.