కర్నూలు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఆధిపత్యం దక్కిన ఈ జిల్లాలో అనంతర కాలంలో చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాజకీయాలను మలుపు తిప్పారు. వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి - ఆయన కుమార్తెలను టీడీపీలోకి తెచ్చారు. దీంతో అక్కడ టీడీపీలో వర్గపోరు తీవ్రమైన సంగతి తెలిసిందే. కానీ.. అకస్మికంగా భూమా నాగిరెడ్డి మరణించడంతో మళ్లీ రాజకీయాలు మారుతున్నాయి. నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానం తనకు కావాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుపట్టడం... సానుభూతి కారణాలతో చంద్రబాబు అక్కడి టిక్కెట్ ను భూమా కుటుంబానికి ఇస్తానని శిల్పాకు చెప్పేయడంతో ఆయన మండిపడుతున్నారు. తన అనుచరులతో సమావేశమై వైసీపీలోకి వెళ్లేందుకు ఆయన నిర్ణయించుకున్నారు.
అయితే... మోహనరెడ్డి సోదరుడు - కర్నూలు టీడీపీ అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి కూడా ఎంత చెప్పినా మోహన్ రెడ్డి మాత్రం మాట వినడం లేదట. 2019 ఎన్నికల్లో నీకే టిక్కెట్ వస్తుందని చక్రపాణి రెడ్డి చెప్పినప్పటికీ మోహనరెడ్డి మాత్రం సంతృప్తి చెందలేదని సమాచారం. వైసీపీలోకి వెళ్లేందుకే ఆయన నిర్ణయించుకున్నారని... చేరికకు ముహూర్తం త్వరలోనే ఉందని చెబుతున్నారు.
నిజానికి నాగిరెడ్డి మరణంతో అక్కడ వర్గపోరు ఆగినట్లేనని... ఇక మనదే రాజ్యమని చక్రపాణి తన సోదరుడికి చెప్పినప్పటికీ ఆయన ఆ వాదనతో ఏకీభవించడం లేదు. నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వడం... నంద్యాల టిక్కెట్ కూడా ఆమె సోదరికి కానీ... నాగిరెడ్డి అన్న కుమారుడికి కానీ ఇవ్వనుండడంతో మళ్లీ ఆ వర్గం బలపడుతుందని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే వారు బలపడడం ఖాయమని... అప్పుడు 2019లోనూ టిక్కెట్ వారికే దక్కుతుందని మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. దీంతో ఆయన ఇక టీడీపీలో ఉండి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చారని... త్వరలోనే టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/