భూమా వర్సెస్ శిల్పా

Update: 2016-11-16 09:48 GMT
వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల కారణంగా టీడీపీలో అంత్యర్యుద్ధాలు పీక్ స్టేజికి చేరాయి. ఇప్పటికే జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి వర్గాలు... ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ - కరణం బలరాం వర్గాల మధ్య బాహాబాహీలతో తలనొప్పులు ఎదుర్కొంటున్న చంద్రబాబు తాజాగా మరో వివాదం కూడా ముదురుతుండడం చీకాకు పెడుతోంది.నంద్యాల టీడీపీలో భూమా నాగిరెడ్డి - శిల్పా మోహనరెడ్డి మధ్య వైరం ఉన్నప్పటికీ అది ఇప్పుడు మరింత పెరిగి నిత్యం మాటల వేడి రగులుతోంది.

  ఇటీవల భూమానాగిరెడ్డి ఎక్కడికి వెళ్లినా శిల్పామోహన్‌ రెడ్డిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉప్పు - పప్పులు అమ్ముకునే వారికి రాజకీయాలెందుకని ఇటీవల శిల్పాను ఉద్దేశించి భూమా కామెంట్స్ చేశారు.కొందరు టీడీపీలో ఉండేందుకు ఇబ్బందిపడుతున్నారంటూ కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శిల్పామోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చేతనైతే ప్రజా సమస్యల పరిష్కారంలో పోటీ పడాలి అని సవాల్ చేశారు. అంతేగానీ తాను చేసిన ప్రజాహితపనులను చూసి ఓర్వలేక అవహేళనగా మాట్లాడడం మంచిది కాదన్నారు. త్వరలోనే తానంటే ఎంటో చూపిస్తానని శిల్పామోహన్‌ రెడ్డి హెచ్చరించారు.

అంతేకాదు.. 400 కోట్లను తెచ్చి నంద్యాలను అభివృద్ధి చేస్తానని చెప్పిన భూమాకు దమ్ముంటే ఆ పని చేయాలని శిల్పామోహన్ రెడ్డి సవాల్ చేశారు. నంద్యాలను టీడీపీ పరం చేయాలన్న ప్రయత్నంలో చంద్రబాబు భూమాను తెచ్చినా తాజా పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో ఆ సీటుపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు ప్రజలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News