గడిచిన నాలుగైదు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ చేరి మంత్రి గా అధికారం అనుభవిస్తున్న టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు అంచనా ఈసారి తప్పింది. ఆయన ఉన్న టీడీపీ ఓడిపోయింది. దీంతో అధికారానికి దూరంగా గంటా ఉండలేక టీడీపీ లో ఇమడ లేక కొద్ది కాలంగా ఆ పార్టీ కి దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్న గంటా శ్రీనివాసరావు బీజేపీ తో హామీలు పొందుతూ ఆ పార్టీ లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. తనతో పాటు 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సైతం బీజేపీ చేర్పించేందుకు గంటా రెడీ అయ్యారన్న వార్త టీడీపీ ని షేక్ చేస్తోంది. రాబోయే మూడు నాలుగురోజుల్లోనే వీరంతా బీజేపీ లో చేరడం.. టీడీపీ లో ప్రకంపనలు రేగడం ఖాయమంటున్నారంతా..
నిజానికి గంటా అధికార వైసీపీ లో చేరి అధికారం అనుభవిద్దామని చూశారని ప్రచారం జరిగింది. అయితే వైసీపీ అధినేత జగన్ కండీషన్లు గంటాకు శరా ఘాతంగా మారాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే జగన్ పార్టీ లోకి తీసుకుంటాడు. అందుకే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనే బదులు బీజేపీ లో చేరడం బెటర్ అని గంటా భావిస్తున్నట్టు సమాచారం.
రెండు రోజులుగా ఢిల్లీ లో ఉన్న గంటా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన రాజ్యసభ ఎంపీలు ఈ భేటిలో గంటాతోపాటు 9మంది టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ లపై చర్చిస్తున్నట్టు తెలిసింది. గంటాతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు మరో టీడీపీ ఎమ్మెల్యే బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం.