ఆలోచనే కొత్తగా ఉందా? త‌్వరలో ఈ ఐడియా నిజం కానుంది. గంటల తరబడి రైళ్లల్లో ప్రయాణం చేసేందుకు బోర్ కొడుతుందా? సరదాగా.. అలా బోగీలు దాటుకుంటూ వెళ్లి షాపింగ్ బోగీకి వెళ్లి నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేసే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా? ఇప్పుడా ఊహను నిజం చేసే దిశగా రైల్వేలు అడుగులు వేస్తున్నాయి.
టికెట్ల ధరలు పెంచకుండా..వేర్వేరు మార్గాలతో ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్న రైల్వేలు.. ఆన్ బోర్డు సేల్స్ ను తెర మీదకు తీసుకొచ్చాయి. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత శతాబ్ది.. కోణార్క్.. చెన్నై ఎక్స్ ప్రెస్ తో పాటు దురంతో రైళ్లలో షాపింగ్ సదుపాయాన్ని కల్పించాలని భావిస్తున్నారు.
ఇందుకు సంబంధించి సెప్టెంబరులో టెండర్లు పిలిచి.. డిసెంబరు నుంచి ఆన్ బోర్డు షాపింగ్ కు తెర తీయాలని భావిస్తున్నారు. తొలుత శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు మొదలు పెట్టాలనుకుంటున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
టికెట్ల అమ్మకాలతో కాకుండా వేర్వేరు మార్గాలతో ఏటా రూ.1200 కోట్లు సంపాదించే లక్ష్యంలో భాగంగా రైల్వే షాపింగ్ కాన్సెప్ట్ తెర మీదకు వచ్చిందని చెబుతున్నారు. ఈ రైల్వే షాపింగ్ లో భాగంగా సెంట్లు.. బ్యాగులు.. వాచీలు లాంటి అనేక రకాల వస్తువుల్ని అమ్మాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. స్టేషన్ల ద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటివరకూ రైల్వేస్టేషన్లో ఉన్న బరువు తూచే యంత్రాల స్థానంలో బాడీ మాస్ ఇండెక్స్ కియోస్క్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
అంతేకాదు.. రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్లలో ఫుట్ మసాజ్ రోబోటిక్ ఛైర్లు.. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నారు.రైల్వే షాపింగ్ విషయానికి వస్తే.. తొలుత శతాబ్ది రైళ్లలో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసి.. ఆ తర్వాత మిగిలిన రైళ్లలో ఈ ఏర్పాటు చేయనున్నారు. కదిలే రైల్లో నచ్చిన వస్తువల్ని షాపింగ్ చేసుకోవటం అదో మజా కదా?