అవసరం లేకున్నా.. అనవసరమైన హడావుడిని ప్రదర్శిస్తున్న ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలకు చురుకు పుట్టేలా వ్యాఖ్యలు చేశారు.. ఏపీ బీజేపీ వ్యవహారాల్ని చూసే యూపీ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్. ఇటీవల ప్రధాని మోడీని ఏపీ విపక్ష నేత జగన్ కలవటంపై ఏపీ అధికారపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పు పట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మోడీని జగన్మోహన్ రెడ్డి కలవటంలో తప్పేముందని సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జగన్ ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత అని.. పైగా ఆయనకు ఎంపీలు ఉన్నారని.. అలాంటప్పుడు ప్రధానిని కలవటంలో తప్పేముందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ఎవరైనా కలవొచ్చని.. అలానే జగన్ ప్రధానిని కలిస్తే తప్పేమిటి? అని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష హోదాతో ప్రధానిని జగన్ కలిశారని.. వివిధ ప్రజాసమస్యల్ని మోడీ దృష్టికి తీసుకెళ్లారన్నారు.
మోడీతో జగన్ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవన్న ఆయన.. ప్రతిపక్ష నేత హోదాతో ఎప్పుడైనా ఎవరైనా ప్రధాని మోడీని కలవొచ్చని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయాల కోణంలో చూసే ఏపీ తెలుగు తమ్ముళ్లకు.. బీజేపీ నేత మాటలు జీర్ణించుకోవటం కష్టంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ అధినేత విదేశీ పర్యటనలో ఉన్న వేళ.. ప్రధాని మోడీని విపక్ష నేత కలవటం ఏమిటన్న అర్థం లేని కలవరాన్ని వ్యక్తం చేస్తున్న ఏపీ తమ్ముళ్లకు చురుకుపుట్టేలా సదరు బీజేపీ నేతల మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిద్దార్థ్ నాథ్ సింగ్ మాటల తర్వాత అయినా.. ప్రధానితో విపక్ష నేత భేటీపై చేస్తున్న వ్యాఖ్యల విషయంలో తమ్ముళ్లు కాస్త తగ్గుతారేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/