తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన దోరణిని ఆయన సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అధికారులు కూడా అదే రీతిలో ముందుకు సాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ సొంత జిల్లాలో తాజాగా తెరమీదకు వచ్చిన అంశం దీన్ని నిజం చేస్తోంది. సిద్దిపేటలో కలెక్టరేట్ తాత్కాలిక భవనం కోసం మెదక్ రోడ్‌లోని ఎల్లంకి కళాశాలను ఎంపిక చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ వాస్తు సలహాదారుతో చూపించగా దానికి వాస్తుదోషం ఉందని చెప్పారు. దీంతో అక్కడ కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని విరమించుకున్నారు. ఈ నిర్ణయం ఇపుడు రచ్చరచ్చగా మారింది.
ముందుగా చూసిన కార్యాలయం అనుకూలంగా లేకపోవడంతో పలు ప్రభుత్వ - ప్రయివేటు కార్యాలయాలను పరిశీలించారు. చివరకు సిద్దిపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలోని అంబేద్కర్ భవనంలో తాత్కాలిక కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయాలని వాస్తు నిపుణులు - ఆధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అంబేద్కర్ భవనంలో కోటి రూపాయలు ఖర్చు చేసి కలెక్టర్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ - మంత్రి హరీశ్ రావు స్వయంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి, నూతన జిల్లాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆ సందర్భంలోనే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కు ఆటంకాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ సందర్భంగా కేసీఆర్ రాక కోసం ఏర్పాట్లు చేపడుతున్న సందర్భంలో ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ కార్మికుడు విద్యుద్ఘాతంతో మృతిచెందాడు. గ్యాస్ బెలూన్ లు పేలి సుమారు 40 నుంచి 60 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో టీఆర్ ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ యాదవ్ కూ గాయాలయ్యాయి. ఇలా సిద్ది పేట కలెక్టరేట్ ప్రారంభం రోజూ ప్రమాదాలు జరగడంతో వాస్తుదోషమే ప్రధాన కారణంగా భావించిన అధికారులు మళ్లీ మరమ్మతులు చేపడుతున్నారు.
ఒకవైపు పరిస్థితులు ఇలా ఉంటే సామాన్యులకు పరిపాలన చేరువ కాకపోవడంతో సమస్యగా మారింది. కోటి రూపాయలతో తాత్కాలిక కలెక్టరేట్ భవనం నిర్మిస్తే అక్కడ ఇంతవరకు కలెక్టర్ విధులే నిర్వహించలేదంటున్నారు. ఆర్డీవో కార్యాలయంలోనే కలెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంగా ఈ భవనంలో వాస్తు దోషం తొలగించేందుకు మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనానికి వెనుక వైపు ప్రధాన ద్వారం ఉండేలా మరమ్మతులు చేపడుతున్నారు. వెనుకవైపు గోడను జేసీబీతో తొలగించారు. కలెక్టరేట్ భవనానికి వెనుకవైపు గోడను జేసీబీతో తొలగిస్తున్న క్రమంలో స్థానికులు పనులను అడ్డుకున్నారు. వెనుకవైపు భవనానికి తూర్పు దిశగా ప్రధాన ద్వారం ఏర్పాటు చేసేందుకు చేపట్టిన పనుల ను ఆపేసి కాలనీవాసులు వాగ్వాదానికి దిగారు. తమ అపార్టుమెంట్ వైపు ప్రధాన ద్వారం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన చేశారు. ట్రాఫిక్ సమస్య తీవ్రమై ప్రశాంతత కోల్పోతామని వాపోయారు. గల్లీని పూర్తిగా అధికారులు ఆధీనం లోకి తీసుకుని మరమ్మతులు చేయడం సరికాదని చెప్పారు. సుమారు 40 కుటుంబాలు ఉంటున్న కాలనీని ఇబ్బందులకు గురి చేయొద్దని, వెంటనే పనులను ఆపాలని బైటాయించారు. మొత్తంగా వాస్తు రచ్చ ఇపుడు సీఎం సొంత నియోజకవర్గంలో రచ్చగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/