మహమ్మారి కరోనా వైరస్ వేలాదిమంది ఉసురు తీసుకుంది. దాదాపు లక్షన్నర మందికి పైగా ఈ వ్యాధి సోకింది. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. వ్యాధి సోకినవారు చాలామంది చికిత్స అనంతరం బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ నుండి వైద్యం అనంతరం తప్పించుకున్న వారికి కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నుండి బయటపడినప్పటికీ కొంతమందికి ఇతర సమస్యలు ఉత్పన్నమౌతున్నాయట.
హాంగ్‌కాంగ్‌లో పన్నెండు మంది కరోనా నుండి కోలుకున్నారు. కానీ వీరిలో ముగ్గురికి త్వరగా ఆయాసం - ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. మిగిలిన తొమ్మిది మందికి స్కాన్ చేయగా వారి ఊపిరితిత్తుల్లో చీలికలు ఎక్కువగా కనిపించాయని తెలుస్తోంది. ఈ వ్యాధి సోకి నయమైనప్పటికీ ఊపిరితిత్తుల పనితీరు ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు తగ్గిందట. వ్యాధి నుండి బయటపడినప్పటికీ కొంతమంది ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు హాంగ్ కాంగ్ వైద్యులు గుర్తించారు.
ఆసుపత్రి నుండి కోలుకొని వెళ్లిన కొంతమందిని వైద్యులు పరిశీలించి కొత్త సమస్యను గుర్తించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం వారు కాస్త వేగంగా నడిస్తే ఊపిరి తీర్చుకోవడంలో ఇతరుల కంటే ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఐతే వారు హృదయ సంబంధ వ్యాయామం చేయడం ద్వారా వారి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంటే ఈత వంటి వాటి ద్వారా క్రమంగా మెరుగుపడవచ్చు.
శుక్రవారం నాటికి 69,607 మంది కరనా వైరస్ వ్యాధి నుండి కోలుకున్నారు. లక్షా ముప్పై వేల మందికి పైగా సోకింది. భారత్ లో కరోనా వైరస్ కేసులు 84కు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా పాజిటవ్ అని తేలిన తర్వాత చికిత్స తీసుకొని కోలుకున్న వారిని ఏడుగురిని డిశ్చార్జ్ చేశారు. యూపీ నుండి ఐదుగురు - రాజస్థాన్ - ఢిల్లీ నుండి ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు.