సీదరి అప్పలరాజు. మార్చి 31న తెల్లారి లేస్తూనే మీడియాకు వార్త అయిపోయారు. నిజంగా మార్చి 31 అంటే ఆర్ధిక సంవత్సరం చివరి రోజు. కానీ ఏపీలో రాజకీయాలకు ఆట విడుపు ఎపుడూ లేదు కదా. అందుకే బ్రేకింగ్ న్యూస్ అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా సైతం మార్నింగ్ నుంచి సీదరి అప్పలరాజు మీదనే ఫోకస్ పెట్టి తెగ ఊదరగొట్టాయి.
సీదరి అప్పలరాజుకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కబురు వచ్చింది ఆయన మంత్రి పదవి ఊస్టింగ్ ఖాయమని అదే పనిగా ప్రసారం చేసి పారేశారు. అయితే సీదరి అప్పలరాజు ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. కడపలో దారుణ హత్యకు గురి అయిన డాక్టర్ అచ్చెన్న సంతాప సభలో పాల్గొనేందుకు తాను విజయవాడ వచ్చినట్లుగా సీదరి తనను కలసిన మీడియాకు చెప్పారు.
తనను ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరూ పిలవలేదు అన్నారు. అయినా తన పదవి పోతుందని వార్తలు రావడం చూశానని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అన్న దాని మీద ఎలాంటి సమాచారం తన వద్ద లేదని ఆయన అన్నారు.
ఒకవేళ తనను మంత్రి పదవి నుంచి తీసేయాలని ముఖ్యమంత్రి జగన్ భావించినా సరేనని అంటాను అని ఆయన చెప్పడం విశేషం. తనకు మంత్రి పదవి కంటే ప్రజా సేవ చేయడమే ముఖ్యమని అన్నారు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా మంత్రులే అని ఆయన అంటున్నారు.
వెనకబడిన కులం నుంచి వచ్చిన తనను మంత్రిని చేసిన ఘనత జగన్ దే అని ఆయన అన్నారు. మొత్తానికి సీదరి అప్పలరాజు విజయవాడలోనే ఉన్నారు. ఆయన హుటాహుటిన శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్లారు. దాంతోనే ఆయనకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే కచితంగా నలుగురైదుగురు మంత్రులకు పదవులు పోవడం ఖాయమని అంటున్నారు. అందులో శ్రీకాకుళం నుంచి రెండవ మంత్రిగా ఉన్న సీదరి అప్పలారాజు ఒకరని ప్రచారం అయితే సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గంలో కూడా పని తీరు పట్ల జనాలు అసంతృప్తిగా ఉన్నారని అంటునారు. అదే విధంగా సీదరి మంత్రిగా కూడా దూకుడు కనబరచలేకపోతున్నారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే పలాస వైసీపీ లో వర్గ పోరు ఒక స్థాయిలో సాగుతోంది. సీదరికి టికెట్ ఇవ్వవద్దు అని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి పాలు అవుతారని చెబుతున్నారు. పలాసలో టీడీపీ పుంజుకుంది. దాంతో సీదరిని తప్పిస్తారు అని అంటున్నారు. దాంతో ముందుగా మంత్రి పదవిని తీసుకుని ఎన్నికల వేళ టికెట్ వేరే వారిని ఇస్తారని, ఈ మధ్యలోనైనా కొత్త వారిని ఇంచార్జిని నియమించినా నియమించవచ్చు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తూంటే సీదరికి విషయం అంతా అర్ధం అయిందని అంటున్నారు. ఆయనకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడం అయితే నిజం అయి ఉండవచ్చు కానీ మంత్రి పదవి నుంచి తప్పించే వారి జాబితాలో ఆయన పేరు కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి సీదరి లక్ ఎలా ఆయనకు ఫేవర్ చేస్తుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.