తెలంగాణ లో కరోనా మాటును పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా కేసులతో పాటు ఇతర వైరల్ వ్యాధులు దేశ ప్రజలకు నిదర లేకుండా చేస్తోంటో, తాజాగా క్యాన్సర్ గురించి ఆందోళనకర విషయాలు బయటకు వస్తున్నాయి. ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి 11.1 శాతం మేర కేసులు పెరిగే ప్రమాదం ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిసెర్చ్ (ఎన్ సీడీఐఆర్)లు హెచ్చరించాయి. రాష్ట్రంలోని క్యాన్సర్ పరిస్థితిపై ఐసీఎంఆర్, ఎన్ సీడీఐఆర్ ఈ మేరకు నివేదికను విడుదల చేశాయి.
ప్రొఫైల్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్-తెలంగాణ పేరుతో ఆ సంస్థలు చేసిన అధ్యయనాల ప్రకారం.. రాష్ట్రంలో 2020లో 47,620 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 0-19 మధ్య వయసువారే అధికంగా ఉంటున్నారు. నాలుగేళ్లలో ఆ సంఖ్య 53,565కు చేరుతుంది. ఏడాదికి సగటున 3,865 కేసులు నమోదవుతున్నాయి. పురుషుల్లో 42.2 శాతం, మహిళల్లో 13.5 శాతం మందికి పొగాకు వల్ల క్యాన్సర్ వస్తోంది. అంటే మొత్తం బాధితుల్లో 55 శాతం మంది పొగాకు కారణంగా క్యాన్సర్ బారినపడుతున్నారు. పురుషుల్లో ఎక్కువగా నోటి (13.3 శాతం), ఊపిరితిత్తులు (10.9 శాతం), నాలుక (7.9 శాతం) క్యాన్సర్లు వస్తున్నాయి. మహిళలు రొమ్ము (35.5 శాతం), గర్భాశయ ముఖద్వార (8.7 శాతం), అండాశయ (6. 9 శాతం) క్యాన్సర్ బారినపడుతున్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో 2014లో ఏర్పాటు చేసిన పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ర్టీ (పీబీసీఆర్) లో ఈ కేసులను నమోదు చేస్తున్నారు. దీని పరిధిలో నిమ్స్, బసవతారకం ఇండో అమెరికన్, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి.ఈ రిజిస్ట్రీ సమాచారం ఆధారంగా ఐసీఎంఆర్, ఎన్ సీడీఐఆర్ ఈ నివేదికను రూపొందించి విడుదల చేశాయి. 74 ఏళ్లలోపు ఎప్పుడైనా కాన్సర్ వచ్చే అవకాశముందని నివేదిక పేర్కొంది. పొగాకును నియంత్రిస్తే ఈ మహమ్మారిని కొంత మేరకు తగ్గించడానికి అవకాశముందని సూచించింది. నిమ్స్ లో 2014లో పీబీసీఆర్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఇది క్యాన్సర్ వివరాలు సేకరిస్తుంది. తెలంగాణలో జనాభా ఆధారంగా కాన్సర్ రిజిస్ట్రీని నిర్వహిస్తున్నాని పీబీసీఆర్ ఇన్ చార్జి, నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు తెలిపారు. ఇకపై ఏటా క్యాన్సర్ రిజిస్ట్రీని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని కాన్సర్ కు సంబంధించిన ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నుంచి బాధితుల వివరాలు సేకరించి, తమ కేంద్రంలో నమోదు చేస్తామని, ఆ సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా ఐసీఎంఆర్ కు నివేదిస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం భారత్ లో సుమారు 13.9 లక్షల క్యాన్సర్ రోగులుండగా 2025 నాటికి ఇది 15.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో పొగాకు వినియోగం ఎక్కువగా ఉండటంతో అక్కడి పురుషులు అధికంగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. దీంతో పొగాకు సంబంధిత క్యాన్సర్లు 27.1 శాతంగా ఉన్నాయి. అంటే పొగాకు వినియోగం కారణంగా ఒక్క ఈ ఏడాదిలోనే 3.7 లక్షలమంది దీని బారిన పడ్డారు. పురుషుల్లో ఊపిరితిత్తుతలు, కడుపు, అన్నవాహిక క్యాన్సర్ అధికంగా ఉంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్(14.8%), గర్భాశయ క్యాన్సర్(5.4%) ఎక్కువగా వస్తోంది. క్యాన్సర్ బాధితులు ఎక్కువగా మిజోరంలోని ఐజ్వాల్(పురుషుల్లో ఎక్కువగా క్యాన్సర్), అరుణాచల్ ప్రదేశ్ లోని పపుం పురె (మహిళల్లో అత్యధికంగా క్యాన్సర్) జిల్లాలో, తక్కువగా మహారాష్ట్రలోని ఒస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో ఉన్నారు.