తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన ప్రత్యేకత కోసం ఎప్పుడూ తపిస్తుంటారనే సంగతి తెలిసిందే. తన పథకాల ఆలోచన విషయంలో కానీ లేదా తాను తీసుకోబేయే నిర్ణయాల విషయంలో కానీ కేసీఆర్ తీరు డిఫరెంట్. అలాంటి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా కార్మికులకు పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ద్వారా ఈ ప్రత్యేకతను సాధించుకున్నారు. తద్వారా దేశంలో మరెవరికీ లేని గుర్తింపు పొందారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సింగరేణి ఎన్నికల సమయంలో కార్మికుల సొంత ఇంటికి సహయం చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని సింగరేణి అమలు చేసింది. రూ. 10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపునకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. తద్వారా సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్... దేశంలో ఏ ప్రభుత్వ సంస్థలోనూ లేని వినూత్న పథకం ఇది అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వెంటనే అమలుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
రూ. 10 లక్షల గృహ రుణంపై వడ్డీ మొత్తాన్ని సింగరేణి చెల్లించనుందని శ్రీధర్ తెలిపారు. ఇప్పటికే గృహ రుణం తీసుకున్నవారికి కూడా రూ. 10 లక్షల రుణానికి వడ్డీ చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ తెలిపారు. ఏడాదికి రూ. 130 కోట్ల వరకు వడ్డీ రూపంలో కార్మికులకు సింగరేణి చెల్లించనుందని శ్రీధర్ తెలిపారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నరని శ్రీధర్ కొనియాడారు.