క‌మీష‌న్ల‌పై మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ షాకింగ్ కామెంట్స్!

Update: 2018-03-18 06:17 GMT
``ప‌ద‌విలోకి రావ‌డానికి చాలా ఖ‌ర్చు చేశాం....పొద్దుగాల లేస్తే వ‌ర్క్ ల కోసం తిరుగుతుంటం....కొబ్బ‌రికాయ‌లు కొట్టి వ‌ర్క్ స్టార్ట్ చేస్తాం....అటువంటిది...వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాత కౌన్సిల‌ర్ల‌కు క‌నీసం....వ‌న్ ప‌ర్సెంటో....టూ ప‌ర్సెంటో క‌మీష‌న్ ను కాంట్రాక్టుర్లు ఇవ్వాలి క‌దా....అయినా కాంట్రాక్ట‌ర్ల‌ ద‌గ్గ‌ర నుంచి క‌మీష‌న్లు తీసుకుంటే త‌ప్పేంటి....క‌మీష‌న్లు తీసుకోవ‌చ్చ‌ని మంత్రిగారే చెప్పారు....`` ఇదంతా ఏ ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్యో జ‌రిగిన వ్య‌క్తిగ‌త సంభాష‌ణ అనుకుంటే పొర‌పాటే. తెలంగాణ‌లో బాధ్య‌త గ‌ల ఓ ప్ర‌జాప్ర‌తినిధి పూర్తి బాధ్య‌తార‌హితంగా మాట్లాడిని మాట‌లు ఇవి.  ఏ కార్య‌క‌ర్త‌తోనో, స్నేహితుల‌తోనో....చిట్ చాట్ సంద‌ర్భంలో ఇలా మాట్లాడి ఉంటార‌నుకుంటే మ‌ళ్లీ పొర‌బ‌డినట్లే. తెలంగాణలోని సిరిసిల్ల రాజ‌న్న జిల్లాలోని సిరిసిల్ల మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ సామ‌ల పావ‌నీ దేవ‌దాస్ ....ఓ ప్రెస్ మీట్ లో మీడియా ప్ర‌తినిధుల సాక్షిగా లైవ్ లో త‌మ క‌మీష‌న్ల బాగోతాన్ని బాహాటంగా చెప్పేశారు. చెప్ప‌డ‌మే కాదు...ఇవ‌న్నీ మీడియాకు తెలియ‌నివి కావ‌ని...అందుకే తాను చెబుతున్నాన‌ని త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు. పావ‌నీ క‌మీష‌న్ల `ఎపిసోడ్` కొద్ది గంట‌ల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ వ్య‌వ‌హారంపై పావ‌నికి టీఆర్ ఎస్ హైక‌మాండ్ అక్షింత‌లు వేసింద‌ని తెలుస్తోంది. దీంతో, పావ‌నీ హుటాహుటిన త‌న ప‌దవికి పావ‌ని రాజీనామా చేశారు.

సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ హోదాలో పావ‌ని త‌న‌ కార్యాలయంలో శ‌నివారం నాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మాట‌ల సంద‌ర్భంలో ఆమె క‌మీష‌న్ల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ వార్డు, మునిసిపాలిటీ ప‌రిధిలో జ‌రిగే అభివృద్ధి ప‌నులను ద‌క్కించుకున్న కాంట్రాక్ట‌ర్ల నుంచి 2 ప‌ర్సెంటో....3 ప‌ర్సెంటో క‌మీష‌న్ల‌ను కౌన్సెల‌ర్లు తీసుకోవ‌చ్చ‌ని స్వ‌యంగా మంత్రిగారే చెప్పార‌ని మీడియాకు సెల‌విచ్చారు. ఇక్క‌డ ఒక్క చోటే కాద‌ని తెలంగాణ‌లో అన్ని మునిసిపాలిటీల్లో ఇదే త‌ర‌హా లో క‌మీష‌న్ల వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని చెప్పారు. అయితే, అంద‌రు కాంట్రాక్ట‌ర్లు...బాధ్య‌త‌గా క‌మీష‌న్ ఇవ్వాల‌ని, అన్ని చోట్ల ఇస్తున్నారో లేదో త‌న‌కు తెలియ‌ద‌ని మొహ‌మాటం లేకుండా చెప్పారు. అంద‌రు వార్డు కౌన్సిల‌ర్ల లాగే తాను కూడా క‌మీష‌న్ తీసుకుంటాన‌ని నిస్సంకోచంగా చెప్పారు. అయితే, కొందరు కాంట్రాక్టర్లు ఈ క‌మీష‌న్ల వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. క‌మీష‌న్ల వ్య‌వ‌హారం త‌న భ‌ర్త చూసుకుంటార‌ని - మీటింగ్ లు ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాలు తీను చూసుకుంటాన‌ని చెప్పడం కొస‌మెరుపు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో పావ‌ని పై  టీఆర్ ఎస్ హైక‌మాండ్ సీరియ‌స్ అయింద‌ని తెలుస్తోంది. దీంతో, నిన్న రాత్రి హుటాహుటిన పావ‌ని...మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ను క‌లిసి రాజీనామా ప‌త్రం స‌మ‌ర్పించారు. అయితే, తాను వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే రాజీనామా చేస్తున్న‌ట్లు అందులో పేర్కొన్నారు.


Tags:    

Similar News