ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లు, అత్తా కోడళ్లు కూడా పోటీపడుతున్నారు. పంచాయతీ ఎన్నికలను చాలామంది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. ఇక్కడ పార్టీల కంటే వ్యక్తిగత ప్రతిష్ఠలు, లోకల్ నాయకులకు ప్రజలతో ఉన్న సత్సంబంధాలే కీలక పాత్ర పోషిస్తాయి.
ఏపీలో ఇవాళ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతున్నది. తొలివిడత 141 పంచాయతీల్లో పోలింగ్.. కౌంటింగ్.. ఫలితాల ప్రకటన, ఉప సర్పంచ్ ఎన్నిక అన్ని జరగనున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ సర్పంచ్ పదవికి ఈదర రాజకుమారిని ఓ పార్టీ రంగంలో దింపగా.. మరో పార్టీ ఆమె సోదరి ఈదర సౌందర్యకు మద్దతు ఇస్తున్నది. దీంతో అక్కడ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఇదిలా ఉంటే మరో వైపు కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు బరిలోకి దిగారు.
గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్య నామినేషన్‌లు వేశారు. ఇప్పటికే ప్రచారం ముమ్మరంగా సాగింది. అనేక గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపారు. అయితే ఏ పార్టీ మద్దతు దారులు ఎంత మంది గెలవనున్నారు. ఇవాళ సాయంత్రం తేలిపోనున్నది.