గుసగుస : టీడీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా శిష్ట్లా లొహిత్.....?

Update: 2023-05-21 06:00 GMT
తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రయోగం చేయనుందా. నవ యువకులతో వచ్చే ఎన్నికల్లో తలపడనుందా అంటే ప్రచారం మాత్రం అలాగే సాగుతోంది. రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసేందుకు శిష్ట్లా లోహిత్ అనే యువ పారిశ్రామికవేత్త పేరుని పరిశీలిస్తున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

లోహిత్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అలాగే,  కార్యకర్తల సంక్షేమ విభాగం కోఆర్డినేటర్ గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక లోహిత్ బయోడేటా విషయానికి వస్తే  సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు.

అదే విధంగా  శిష్ట్లా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన గత ఏడాది చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏకంగా పది లక్షల రూపాయలను  పార్టీ నిధికి విరాళం ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు.

ఇల లోహిత్‌ తండ్రి రమేశ్‌ గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. లోహిత్‌ కుటుంబం తీసుకుంటే  గత 30 ఏళ్లుగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో ఉంది. లోహిత్‌ ప్రస్తుతం ఆతిథ్య రంగం నుంచి రియల్‌ ఎస్టేట్‌ వరకు నాలుగు ఐదు కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ గా విధులను నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే లోహిత్ రాజమండ్రి ఎంపీ సీటు మీద కన్నేసి చాలా కాలంగా ఇక్కడ నుంచే పనిచేస్తున్నారు అని అంటునారు. ఆయన ఎంపీ కావాలని కూడా టార్గెట్ గా పెట్టుకున్నారని అంటున్నారు. రాజమండ్రిలో బ్రాహ్మణ సామాజిక వర్గం గణనీయమైన సంఖ్యలో ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ రెండు సార్లు ఎంపీగా పనిచేశారు.

ఆ తరువాత ఆ సామాజికవర్గం నుంచి ఎవరూ పోటీ చేసి గెలవలేదు. దాంతో లోహిత్ రాజమండ్రిని ఎంచుకున్నారని అంటున్నారు. అయితే ఈ సీటుని నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణం రాజుకు ఇస్తారని ప్రచారంలో ఉంది. ఒక వేళ ఆయన కనుక కాకపోతే లోహిత్ కే అని అంటున్నారు. నూటికి తొంబై శాతం లోహిత్ కి ఈ సీటు ఇస్తారని ప్రచారంలో ఉన్న మాట.

లోహిత్ కేవలం 28 ఏళ్ళ నవ యువకుడు. ఈ చిన్న వయసులోనే పారిశ్రామికవేత్తగా ఎదిగారు. మంచి విజన్ ఉన్న లీడర్ గా ఉన్నారు. దాంతో పాటు అర్ధబలం పుష్కలంగా ఉంది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ఆయన వెనకాడే ప్రసక్తి లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా లోహిత్ కి రాజమండ్రి ఎంపీ టికెట్ దక్కుతుందా అంటే లోకల్ టీడీపీలో ఒక గాసిప్ గా ప్రచారం సాగుతోంది. ఏమి జరుగుతోందో చూడాల్సి ఉంది.

Similar News