ఏచూరీ.... ఎటువైపు నీ దారి?

Update: 2017-05-22 06:27 GMT
 పార్టీ ప‌ద‌వులు అనుభ‌వించ‌డానికి కూడా కాలం క‌లిసి రావాలి. కొన్నిసార్లు అనుభ‌వించాల‌ని ఉన్నా ఏర్ప‌ర‌చుకున్న నిబంధ‌న‌లు ఇరుకున పెట్టేస్తాయి. దాంతో ఎంత పెద్ద లీడరైనా చేతులు ముడుచుకు కూర్చోవాల్సింద. ఇపుడు సి.పి.ఎం. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం పూర్తికానుంది.  ఇప్ప‌టికే రెండుసార్లు రాజ్య‌స‌భకు ఎన్నిక‌యిన ఆయ‌న సి.పి.ఎం. పార్టీ నిబంధ‌న ప్ర‌కారం మూడోసారి వెళ్ల‌కూడ‌దు. కానీ ఆయ‌న‌కు మాత్రం మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని ఉందట. దీనికి సొంత పార్టీ బ‌లం స‌రిపోక‌పోయినా కాంగ్రెస్ స‌హ‌క‌రించ‌డానికి సిద్దంగా ఉంది. కానీ పార్టీ నిబంధ‌న‌లు స‌హ‌క‌రించ‌డం లేదు. ఇది పెద్ద ఇర‌కాటంలో ప‌డేసింది ఏచూరిని .త‌న‌కు సంబంధించిన నిర్ణ‌యం, పార్టీ ప‌రంగా తీసుకోవాల్సిన నిర్ణ‌యంలో ఏం చేయాలో తోచ‌ని స్థితిలో ఏచూరి ప‌డిపోయారు.

    రాజ్య‌స‌భ‌లో సీతారాం పదవీ కాలం  ముగియ‌నుంది. ఇప్ప‌టికే ఆయ‌న రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. పార్టీ నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి ఒకే వ్య‌క్తి రెండుసార్లు కంటే ఎక్కువ‌సార్లు ఎం.పి అయ్యే అవ‌కాశం లేదు. పార్ల‌మెంటు స‌భ్యుడిగా కొన‌సాగాల‌ని మ‌న‌సులో ఏచూరికి ఉంది. నిబంధ‌న మారిస్తే వ్య‌క్తిలాభం కోసం మార్చార‌ని అంటారు. ఈ ఆరోప‌ణ ఎదుర్కోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అనేది వెన్నాడుతోంది.

    మ‌రోవైపు బెంగాల్ నుంచి మూడోసారి ఎన్నిక‌య్యేంద‌కు త‌గిన సంఖ్యాబ‌లం కూడా ఏచూరికి లేదు. కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు తీసుకొని గెల‌వాలి. ఆ మ‌ద్ద‌తుకు తాము రెడీ అని కాంగ్రెస్ అంటోంది. రాజ్య‌స‌భ‌లో గ‌ట్టిగా మాట్లాడ‌గ‌లిగే నేత‌లు కాంగ్రెస్‌లో లేరు. దీంతో ఏచూరి అవ‌స‌రం కాంగ్రెస్ కు ఉంది. అందుకే ఏచూరికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి కాంగ్రెస్ సిద్దంగా ఉంది. ఇటు కాంగ్రెస్ మ‌ద్ద‌తు తీసుకొని సిద్దాంత‌ప‌రంగా పల‌చ‌న‌వ్వ‌డ‌మా, నిబంధ‌న‌లు మార్చి పార్టీలో విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డ‌మా అనేది ఇపుడు తేల్చుకోవాల్సింది ఏచూరినే.
Tags:    

Similar News