స్వాములోరు జోలికి వెళ్లటానికి ఏ ప్రభుత్వం సాహసించదు. చరిత్రను చూస్తే.. కొమ్ములు తిరిగిన స్వాములోరి మీద కత్తి కట్టిన వైఖరి తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తుంది. ఏపీలో ఇలాంటి పరిస్థితి దాదాపుగా కనిపించదు. కానీ.. అందుకు భిన్నంగా ఏపీ సర్కారు అనుసరించిన తాజా తీరు ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తేలా చేయటంతో పాటు.. ఏపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు వచ్చేలా చేసిందని చెప్పొచ్చు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా అభివృద్ధిపనులు చేపట్టేందుకు వీలుగా పెద్ద ఎత్తున దేవాలయాలు కూల్చేయటం పెను వివాదంగా మారింది.
వెనుకా ముందు చూసుకోకుండా దేవాలయాల్ని పెద్ద ఎత్తున కూల్చేయటంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా నిద్ర లేచిన ఏపీ సర్కారు నష్టనివారణ చర్యలు తీసుకున్నప్పటికి.. అవేమీ ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఏపీ సర్కారు తీరుపై సాధువులు.. స్వాములు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం ఎపిసోడ్ విజయవాడ ఎంపీ కేశినేని నాని దగ్గరుండి చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనపై స్వాములు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దేవాలయాల కూల్చివేతపై హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సభలో పాల్గొన్న పలువురు తీవ్ర ఆగ్రహంతో ప్రసంగించటం గమనార్హం.
ఇక.. శివస్వామి అయితే నానిని ఏకంగా శంపించేశారు. విజయవాడ.. హైదరాబాద్ మధ్య నడిచే బస్సులో టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకొని సంపదన కూడగట్టుకున్న నాని.. ఆ సంపదనతోనే ఎంపీ అయ్యారని విమర్శించటమే కాదు.. దేవాలయాల్ని కూల్చేసి అపచారం చేసిన నాని ఇకపై ఏ ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‑కు నడిచే బస్సుల టికెట్లను బ్లాక్‑లో అమ్ముకుని కేశినేని నాని సంపద కూడగట్టుకున్నారని, దాంతోనే ఆయన ఎంపీ అయ్యారని విజయవాడకు చెందిన శివస్వామి మండిపడ్డారు. జీవితంలో ఇక ఎన్నడూ నాని గెలిచే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సభలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తనను పలువురు బెదిరిస్తున్నారని.. తాను భయపడటం లేదని.. ప్రాణ త్యాగానికి తాను సిద్ధమన్నారు.
తన బ్యాంకు ఖాతాలో రూ.3వేలకు మించి ఉండవని.. అలాంటి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. తనను దొంగస్వామి అంటున్న నాని పిచ్చి తుగ్లక్ లా మాట్లాడుతున్నారన్నారు. విజయవాడ ద్వారపాలకుడిని తీసేయటం అత్యంత దారుణమన్న ఆయన.. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని గాయపరిచారని.. ఆలయాల్ని కూల్చి వేయటం ద్వారా తమ గుండెలు బద్ధలు అయ్యాయన్నారు. మసీదులు కూల్చేయటానికి నాలుగు నెలలు సమయం ఇచ్చారని.. గుళ్లు కూల్చేందుకు నాలుగు రోజులు కూడా సమయం ఇవ్వకపోవటం ఏమిటంటూ మండిపడ్డారు. ఒక్కరోజు సమయం ఇచ్చేసి ఆలయాలు కూల్చేశారని.. ప్రాణప్రతిష్ఠ చేసిన ఆలయాల్ని దారుణంగా కూల్చేసి.. అదేమంటే.. రాజస్థాన్.. గుజరాత్ లలో కూడా ఆలయాల్ని కూల్చేసినట్లుగా ఏపీ పాలకులు చెప్పటంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ దేవాలయాలు కూల్చేసినా.. అక్కడి స్థానిక పీఠాధిపతులు.. మఠాధిపతులు.. ఇతరులు అందరిని పిలిపించి.. వారితో మాట్లాడి.. సంప్రదాయం ప్రకారం గుళ్లను తొలగించారే కానీ.. బెజవాడలో మాదిరి వ్యవహరించలేదన్నారు. మంచిచెడులూ చూడకుండా ఆలయాల్ని కూలగొట్టేసి.. విగ్రహాలను మునిసిపల్ ఆఫీసుల్లో పారేయటం ఎంతవరకే సబబు? అని ప్రశ్నించారు.
... కానీ అక్కడ దానికి ముందుగానే స్థానిక పీఠాధిపతుల నుంచి మఠాధిపతులు - ఇతరులు అందరినీ పిలిపించి, వాళ్లతో చర్చించారని.. శాస్త్రోక్తంగా తొలగింపు పనులు చేపట్టడంతో పాటు వేరేచోట ఆలయనిర్మాణానికి భూమి - నిధులు అన్నీ ఇచ్చారని చెప్పారు. అక్కడ కూడా, ముందుగా ఆలయ వర్గాలనే గోడ కూల్చివేత మొదలుపెట్టమని చెప్పి.. ఆ తర్వాత వాళ్ల ఆధ్వర్యంలోనే ఆలయ తొలగింపు పనులు చేపట్టారని, ఇక్కడ మాత్రం మంచీ చెడూ చూడకుండా రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా ఆలయాలు కూల్చేసి విగ్రహాలను మునిసిపల్ ఆఫీసులలో పారేశారని మండిపడ్డారు.
ఆలయాల పేరుతో తాము వ్యాపారం చేస్తున్నట్లు కొందరు మంత్రులు మాట్లాడుతున్నారని.. ఎన్నికల వేళ నామినేషన్ల సమయంలో ఇదే ఆలయాల్లోకి వచ్చి నామినేషన్ పత్రాల్ని పూజలు చేయించిన విషయాన్ని తెలుగు దేశం నేతలు మర్చిపోతే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఏ తెలుగు తమ్ముడు మాత్రం సూటిగా సమాధానం ఇవ్వగలరు..?