విమానయాన రంగ పరంగా తెలంగాణ కాస్త వెనుకంజలోనే ఉంది. రాష్ట్రంలో ఏకైక పెద్ద విమానాశ్రయం శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు. ఈ నేపథ్యంలోనూ పలు జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. మరీ పెద్ద స్థాయిలో కాకుండా ఉంటాయి ఈ విమానాశ్రయాలు. వీటికి సంబంధించిన స్టేటస్‌ను మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయాన శాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇస్తూ తెలంగాణలో ఏర్పాటు చేయదల్చుకున్న విమానాశ్రయాల గురించి వివరించారు.
ఏర్పాటు ఇక్కడే..
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనాన్ని పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రదేశాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణం పూర్తి కావడం అనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ 2022 డిసెంబర్ వరకు పూర్తవుతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సామర్థ్యం ఏడాది 1.2 కోట్ల నుంచి 3.4 కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు.