మోడీకి స్వ‌రాష్ట్రంలోనే ఊహించ‌ని షాక్

Update: 2018-10-02 07:04 GMT
ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ కార్యక్రమాన్ని బహిష్కరించడం...అందులోనూ ఆయ‌న సొంత రాష్ట్రంలోనే అలా జ‌ర‌గ‌డం...ఊహించ‌గ‌ల‌మా?  కానీ అదే జ‌రిగింది. మోడీకి సొంత రాష్ట్రంలోనే నిరసన ఎదురైంది. గుజరాత్‌ లో ఆనంద్‌ జిల్లాలోని మొగర్‌ నగరంలో అముల్‌ కు చెందిన చాక్లెట్‌ ప్లాంట్‌ సహా పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి అమూల్‌ వైస్‌ చైర్మెన్‌ సహా ఆరుగురు డైరెక్టర్లు హాజరు కాలేదు. ఈ ప‌రిణామం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. అయితే ఇదంతా ప్ర‌తిప‌క్ష పార్టీ రాజ‌కీయ‌మ‌ని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ ఎపిసోడ్‌ పై అమూల్ వైస్‌ చైర్మెన్‌ - కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజేంద్ర సిన్హ పర్మార్ మాట్లాడుతూ ఐదుగురు డైరెక్టర్లు సహా తను ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారని  తెలిపారు. ప్రధాని పర్యటనపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చైర్మెన్‌ - ఎండీకి తెలిపారని అన్నారు. అయితే అది రాజకీయ కార్యక్రమంగా ఉండొద్దని సూచించారని చెప్పారు. కానీ ఆ ఫంక్షన్‌ లో వారు సొంత డబ్బా కొట్టుకున్నారని - ఈ కార్యక్రమంతో అమూల్‌ కు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆహ్వాన పత్రంపైనా కేవలం బీజేపీ నేతల పేర్లే ఉన్నాయని - వేదిక మీద ఒకే పార్టీ నాయకులున్నారని తెలిపారు. అమూల్‌ కార్యక్రమాన్ని బీజేపీ హైజాక్‌ చేసిందని శనివారం అన్నారు. వేదిక ప్రాంగణమంతా ఆ పార్టీ స్థానిక నేతల పోస్టర్లు - జెండాలతో నిండిపోయిందని చెప్పారు.

Tags:    

Similar News