చేతిలో డబ్బులుండాలే కానీ కొండ మీద కోతినే కాదు.. దాని అమ్మమ్మను కూడా కిందకు దింపొచ్చన్నది తెలిసిందే. తాజాగా స్కైయాచ్ వన్ జెట్ విమానం గురించి వింటే.. ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. గాల్లో ఎగిరే రాజప్రసాదం లాంటి ఈ జెట్ విమానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
వేలాది కోట్ల రూపాయిలున్న అసాములకు.. వారి హోదాకు తగ్గట్లే భారీ ఆలోచనలు ఉంటాయి. మరి.. ఈ అపర కుబేరులు కోరికలకు తగ్గట్లుగా రూపొందించిందే స్కైయాచ్ వన్ జెట్ విమానం. అత్యంత విలాసవంతంగా తయారు చేసిన ఈ జెట్ ను సొంతం చేసుకోవాలంటే సింఫుల్ గా ఆర్డర్ ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. కాకుంటే రూ.550కోట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది సుమా.
ఈ ప్రైవేట్ జెట్ లో కొనుగోలుదారులు కోరుకున్నట్లుగా తయారు చేసి ఇస్తారు. విలాసవంతమైన మాస్టర్ బెడ్ రూమ్ మొదలు.. డైనింగ్.. కాన్ఫరెస్స్ రూం.. బార్.. లాంటి ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. విలాసానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ లగ్జరీ జెట్ ను అమెరికాకు చెందిన సోటో స్టూడియోస్ సంస్థ డిజైన్ చేసింది. అందరికి దీన్ని కొనే అవకాశం ఉండదు. అందుకే.. కనీసం ఫోటోలు అయినా చూసేయండి.