నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశ్వనగరంగా మలుస్తామని చెబుతున్నారు... ప్రపంచ పర్యాటక కేంద్రంగా నిలపాలని కలలు కంటున్నారు. ప్రజలు కూడా ఏపీ రాజధానిని అత్యద్భుత విదేశీ తళుకుబెళుకులు - సోయగాలు - సౌకర్యాలు - విలాసాలు - వినోదాలు - ఊహకందని ఆనందాల నగరంగా చూడాలనుకుంటున్నారు. మరి అమరావతి అలాంటి కలల నగరం కావాలంటే ఏం చేయాలి... ఎన్నో హంగులు... సరికొత్త సొబగులు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న చిత్రవిచిత్రాలన్నిటినీ తెచ్చి ఏపీలోనూ చేసి చూపించాలి. కొన్ని అక్కడ సాధ్యమైనవి... ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా సాధ్యం కాకపోవచ్చు... కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకుని పర్యాటక ప్రాధాన్యంగా అమరావతిని రూపొందించేందుకు కొంగొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనలకు స్ఫూర్తినిచ్చే పర్యాటక అద్బుతం మచ్చుకు ఒకటి... కజకిస్థాన్ రాజధాని అస్థానాలో రూపుదిద్దుకుంటున్న ఈ విచిత్రం ప్రపంచంలో ఇంకెక్కాడ కనిపించదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడిప్పుడే డెన్మార్క్ వంటి మరికొన్ని దేశాల్లో ఇలాంటివి తయారవుతున్నాయి. ఇంతకీ ఇదేంటో తెలుసా...? 21 అంతస్థుల అపార్టుమెంటు పైనుంచి కిందవరకు ఐస్ స్కేటింగ్ చేసుకునేలా ఉన్న నిర్మాణం.. మతులు పోగొట్టే దీనిపై నుంచి జారుకుంటూ కిందకు రావాలని జనం ఉవ్విళ్లూరుతున్నారు.
''ఆ 21 అంతస్థులు అపార్టుమెంటును చూస్తే వింతగా ఉంటుంది. లిఫ్టులో పై వరకు వెళ్లి 1000 అడుగుల ఎత్తు నుంచి మళ్లీ కిందకు రావడానికి ఎవరూ లిఫ్టు ఉపయోగించడం లేదు... అలా అని మెట్లు దిగడమూ లేదు. మంచుకొండల్లో.... సైబీరియా హిమఫలకాలపై - ఘనీభవించిన నదులపై స్కీయింగ్ చేస్తున్నట్లుగా పత్తిపువ్వుల్లా కనిపిస్తున్న మంచుపైనుంచి జారుకుంటూ కిందకు చేరుతున్నారు'' కజకిస్థాన్ ఆర్కిటెక్టులు చెప్పుకుంటూ పోతున్నారు.... వింటున్నవారంతా రెప్ప ఆర్పకుండా ఆ చిత్రాలు చూస్తూ, వారు చెప్పింది వింటూ ఊహాలోకంలో విహరిస్తున్నారు. వింటుంటేనే ఇంత బాగుంది... దీనిపై తామూ స్కేటింగ్ చేస్తే ఇంకెంత బాగుంటుందో అంటూ కలల్లోకి జారుకున్నారు. అంత గొప్ప ప్రాజెక్టు కాబట్టే అది ''2015 వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్''లో ప్రత్యేకంగా నిలిచింది. స్లాలం హౌస్ గా పేర్కొంటున్న ఇది పూర్తయితే ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ స్కేటింగ్ నివాస గృహసముదాయంగా రికార్డులకెక్కనుంది.
ప్రపంచ దేశాల రాజధానుల్లో అస్థానాకు ఓ ప్రత్యేకత ఉంది. అతి శీతల రాజధాని నగరాల్లో అస్థానాది సెకండ్ ప్లేస్. మంగోలియా రాజధాని ఉలాన్ బేటర్ తరువాత ఇదే అతిశీతల రాజధాని నగరం. ఇక్కడ వేసవిలో కూడా -1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతే ఉంటుంది. వెయ్యి అడుగుల ఎత్తున అంటే పూర్తిగా హిమపాతమే. కాబట్టి ఇలాంటి నిర్మాణానికి ఇది అత్యంత అనుకూలం.
స్లాలమ్ హౌస్ లో 400 ఇళ్లుంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో షాపింగ్ మాల్ ఉంటుంది. ఐస్ హాకీ వంటి ఆటలకు పెట్టింది పేరైన కజక్ లో ఏడాది పొడవునా ఇంటిపై మంచు స్కేటింగ్ చేసే వీలున్న ఇలాంటి నిర్మాణం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
మనదేశంలో వాతావరణానికి ఇలాంటివి అనుకూలం కాకపోయినా ఇలాంటి విభిన్న ఆలోచనలతో పర్యాటకులను ఆకర్షించే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం కనిపిస్తోంది.