లోదుస్తులు లేకుండా నిద్ర.. లాభమా? నష్టమా?

Update: 2020-05-06 04:01 GMT
చాలా హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్లు, హీరోలు ఒంటిపై నూలు పోగు లేకుండా రాత్రంతా బెడ్ మీద నిద్రపోతుంటారు. ఈ సీన్లు చూసినప్పుడు నిజంగానే ఇలా పడుకునే వారు ఉన్నారని తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఉంది. నగ్నంగా.. లేదా ఒంటిపై తక్కువ దుస్తులతో పడుకోవడం వారి హాబీ. ఎందుకంటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని ఇలా చేస్తారు.

అయితే దీనిపై పరిశోధించిన శాస్త్రవేత్తలు ఒంటిపై అసలు దుస్తులు లేకుండా నిద్ర పోవడం వల్ల చాలా లాభాలున్నాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.  మహిళలు బ్రా ధరించి నిద్రపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఏ ఆధారాలు లేవని.. బ్రా దరించకుండా ఉండడానికి చాలా కారణాలున్నాయన్నారు.

ఇక పురుషులు టైట్ గా ఉండే జీన్స్ లోదుస్తులు ధరించినప్పుడు వారి పర్సనల్ పార్ట్స్ దగ్గర వేడి పెరుగుతుంది. దీంతో వీర్యకణాల్లో సమస్య వస్తుంది. వీర్యం డీఎన్ఏ సరిగా ఉండదని పరిశోధకులు తేల్చారు.

దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల నిద్ర లేచిన తర్వాత వారి పనితీరు బాగుంటుందని తేలింది. నిద్రపోతున్నప్పుడు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను మెదడు తొలగిస్తుందని పరిశోధకులు తేల్చారు. మెదడు, శరీరం బాగా పనిచేయాలంటే చుట్టూ ఉన్న వేడిని తగ్గించుకుంటూ శరీరాన్ని చల్లబరుచుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ ఆంస్టర్టాం పరిశోధకులు తేల్చారు.

దుస్తులు వేసుకొని శరీరానికి వేడి ఎక్కువ కలిగిస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రక్తపోటు పెరుగుతుంది. కార్టిసోల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో దుస్తులు లేకుండా నిద్రించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తేల్చారు.

అతితక్కువ దుస్తులతో నిద్రించడం వల్ల శరీరం ఊపిరి పీల్చుకుంటుంది. రోజంతా దుస్తులు శరీరాన్ని కప్పి ఉంచుతాయి. కాబట్టి దుస్తులు తీసేయడం వల్ల సున్నితమైన ప్రదేశాలకు గాలి తగిలి చర్మ సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి.
Tags:    

Similar News