స్లమ్ డాగ్ మిలియనీర్.. భారత దేశంలోని మురికివాడల కుర్రాడు మిలియనీర్ గా మారిన సినిమా కథ. ఆ సినిమాతోనే అదృష్టం తలుపు తట్టి అందలమెక్కాడు మురికివాడ కుర్రాడు అజారుద్దీన్ ఇస్మాయిల్.. మంచి ఇల్లు కట్టుకొని సాఫీగా సాగుతున్న అతడి జీవితానికి అనుకోని ఉపద్రవం.. అనారోగ్యం అతడిని మళ్లీ అదే మురికి వాడకు చేర్చిన దీనగాథ ఇదీ.
ఆస్కార్ అవార్డు పొందిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో హీరో తమ్ముడిగా చేశాడు ఇస్మాయిల్. ముంబైలోని 300 మురికి వాడల పిల్లల్లోంచి అతడిని అమెరికన్ దర్శకుడు డానీ బాయిల్ ఎంపిక చేశాడు. ఈ సినిమా ప్రపంచమంతటా సంచలనం సృష్టించింది. ఆస్కార్ల పంట పండింది. కోట్లాది మంది బారతీయుల్లో ఎవ్వరికి దక్కని అదృష్టం ఇస్మాయిల్ కు దక్కింది. ఆస్కార్ వేదిక పై అతడు నిలబడ్డాడు.
ఆస్కార్ విజేత గా సినిమా నిలవడం తో మురికివాడ పిల్లాడు అయిన అజారుద్దీన్ ఇస్మాయిల్ కు అదృష్టం తలుపుతట్టింది. సినిమా సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు, నిర్మాతలు కలిసి ‘జయహో’ ట్రస్ట్ ద్వారా ఏకంగా ముంబైలోని సాంటాక్రుజ్ లోని అనురాగ్ ప్లాజాలో 49 లక్షలు విలువ చేసే ఓ ఫ్లాట్ ను కొని బహుమతిగా ఇస్మాయిల్ కు ఇచ్చింది.
ఇది జరిగి 12 ఏళ్లు అవుతోంది. కానీ ఇప్పుడు ఇస్మాయిల్ ఆకాశం నుంచి మళ్లీ అదే అథపాతాళానికి చేరాడు. తండ్రి క్షయ వ్యాధికి గురికావడంతో అతడిని కాపాడేందుకు తనకు ఇచ్చిన 49లక్షల ఫ్లాట్ అమ్ముకొని అజారుద్దీన్ కుటుంబం మళ్లీ గతంలో నివసించిన గరీబ్ నగర్ లోని మురికివాడలో 10 అడుగుల పొడువు, 10 అడుగుల వెడల్పు ఉండే ఒకే గదిలో అద్దెకు ఉంటోంది. మిగతా డబ్బులను అజార్ వ్యాపారం చేయగా నష్టాలొచ్చాయి. ఆ డబ్బులను సర్దాడు.
అయితే అజారుద్దీన్ తరచూ అనారోగ్యం పాలయ్యాడు. డ్రగ్స్ కు అలవాటై మంచానా పడ్డాడు. అతడి తల్లి పనిచేస్తూ పోషిస్తోంది. డబ్బులన్నీ అనారోగ్యాలకు ఖర్చు కావడంతో కుటుంబం ఇప్పుడు పూటగడవని పరిస్థితిలో ఉంది. కుమారుడిని ఆదుకోవాలని ఆ తల్లి స్లమ్ డాగ్ మిలియనీర్ దర్శకుడు డాని బోయెల్ ను కోరుతోంది.