జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాణాపాయం ముప్పు తప్పింది. ఆయన కాన్వాయ్ కు ఇవాళ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. కాకినాడ నుంచి రాజానగరం బహిరంగ సభకు పవన్ కల్యాణ్ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ ను లారీ ఢికొంది. ఈ ప్రమాదంలో పవన్ ప్రైవేటు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ భద్రతా సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. కాగా, పవన్ కళ్యాణ్ కు ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు.
ఇదిలాఉండగా...ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. కాకినాడ జి కన్వెన్షన్ హాల్ లో మీడియాతో మాట్లాడారు. సీపోర్టు అక్రమాలపై ఓ డాక్యుమెంటరీని మీడియాకు రిలీజ్ చేశారు. జనసేన అధికారంలోకి వస్తే కాకినాడ సీపోర్టు లైసెన్స్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సీపోర్టు అక్రమాలని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కాకినాడ సీ పోర్టు యజమానిని గతంలో మెలోడీ వెంకటేశ్వరరావు అనేవారని - విశాఖలో చిన్నపాటి థియేటర్ యజమాని అని - సినిమాల్లో ఉన్నప్పుడు రెండు సార్లు కలిశానని పవన్ చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా వేల కోట్లకి అధిపతి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదన్నారు. చిన్నపాటి సినిమా హాల్ యజమాని సీపోర్టు ఓనర్ అయిపోయాడన్నారు. ఓ సామాన్య థియేటర్ ఓనర్‌కి ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందన్నారు. పర్యావరణ శాఖ మాట్లాడదు - పర్యావరణ మంత్రి మాట్లాడరు - ముఖ్యమంత్రి మాట్లాడరు అని పవన్ ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశం ముగించుకొని తర్వాతి కార్యక్రమానికి వెళుతుండగా పవన్ కాన్వాయ్ కు ప్రమాదం చోటుచేసుకుంది.
మరోవైపు పవన్ కాన్వాయ్ కు యాక్సిడెంట్ ఘటనపై జనసేన వెంటనే స్పందించింది. ఘటనపై తక్షణం విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని జనసేన డిమాండ్ చేసింది. లేని పక్షంలో దీన్ని ప్రభుత్వ కుట్రగా భావిస్తామని జనసేన న్యాయవిభాగం ఒక ప్రకటనలో పేర్కొన్నది