బీజేపీ ఫైర్ బ్రాండ్ నేతగా, నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీ మరోమారు తనతో పాటు తన పార్టీకి కూడా ఇబ్బంది కొని తెచ్చారనే చెప్పాలి. తన విద్యార్హత విషయంలో స్మృతి చెప్పిన వివరాలపై గతంలోనే పెద్ద దుమారం రేగింది. టీవీ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న స్మృతి... గడచిన ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ నుంచి ఆమె బీజేపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగారు. అయితే క్రితం సారి ఆమె ఓటమి పాలైనా... రాజ్యసభ సభ్యత్వం ద్వారా మోదీ ఆమెను తన కేబినెట్ లో చేర్చుకున్నారు.
నాటి పోటీ సందర్భంగా తాను అమెరికాలోని యేల్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని చెప్పుకున్న స్మృతి... అందుకు తగ్గ ధృవపత్రాల సమర్పణలో మాత్రం కప్పదాటు వైఖరిని అవలంబించారు. తాజాగా మరోమారు ఆమెను అమేధీ బరిలోకి బీజేపీ దించగా... ఈ సారి తన నామినేషన్ పత్రాల్లో తన విద్యార్హతను ప్లస్ టూ(ఇంటర్)గా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండానే ఎదురు దాడి మొదలెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది ఈ విషయంపై మీడియా ముందుకు వచ్చి స్మృతిని కడిగిపారేశారు. విద్యార్హతల్లోనే స్పష్టత లేని స్మృతి కేంద్ర మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రియాంకా ప్రశ్నించారు. స్మృతికి బుద్ధి లేకున్నా... ఆమెను తన కేబినెట్ లో స్థానం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి అయినా బుద్ధి ఉండాలి కదా అంటూ ప్రియాంకా తనదైన శైలి విమర్శలు గుప్పించారు.
తన ఎడ్యుకేషన్ పైనే స్పష్టత లేని స్మృతి.. కేంద్ర కేబినెట్ లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఎలా కొనసాగారని కూడా ప్రియాంకా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఎలా ఉన్నా... యేల్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాసయ్యానని చెప్పుకున్న స్మృతి.. ఇప్పుడు తన అఫిడవిట్ లో ఇంటర్ మాత్రమే చదివినట్లు పేర్కొని అడ్డంగా బుక్కయ్యారన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ ఆరోపణల నుంచి స్మృతి తనను తాను ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి.