తనపై సోషల్ మీడియా లో కామెంట్ చేసిన ఓ యూజర్ కి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గట్టి సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఆ యూజర్ ఏంచేసాడంటే , కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పులపై కామెంట్స్ చేశాడు. దానికి మంత్రి కూడా ఫన్నీ అండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు చక్కటి ఫోటోలు కూడా పెడతుంటారు. అలాగే తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చాలా ఓపికగా సమాధానం చెప్తుంటారు.
ఈ తరుణంలోనే ఒక యూజర్ మంత్రి స్మృతి ఫొటోపై కామెంట్ చేశారు. ఆ ఫొటోలో స్మృతి ఇరానీ తన ఇంటి గార్డెన్ లో ల్యాప్ టాప్ పై వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఫొటోలో ఆమె నీలిరంగు బట్టలు వేసుకుని హవాయ్ చెప్పులు వేసుకుని కనిపించారు. ఆ ఫోటోను మంత్రి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన ఒక యూజర్ ‘హవాయ్ చెప్పులు’ అని కామెంట్ చేశారు. దీనికి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ… అరె భాయ్… ఇవి రూ. 200 విలువ చేసే హవాయ్ చెప్పులు. బ్రాండ్ మాత్రం అడగకు ఇది లోకల్ అని ఫన్నీగానే సమాధానం ఇచ్చినా దాంట్లో చిన్న కౌంటర్ కూడా మిళితం చేస్తూ రాశారు. దీనిని చూసిన యూజర్స్ వోకల్ ఫర్ లోకల్ అని కామెంట్లు చేస్తున్నారు.