పాములు పట్టే వారికి పద్మశ్రీ.. వీరు బరిలోకి దిగితే తోక ముడవాల్సిందే..!

Update: 2023-01-27 20:32 GMT
మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని అనడానికి ఈ ఇద్దరు స్నేహితులే నిదర్శనంగా నిలుస్తున్నారు. తమ వారసత్వం వస్తున్న వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఇద్దరు మిత్రులు పద్మశ్రీని దక్కించుకోవడం విశేషం. ఇంతకీ ఈ ఇద్దరు ఏ రంగంలో నిష్ణాతులనే కదా మీ డౌట్.. పాములు పట్టే చేతితోనే పద్మశ్రీ అవార్డును దక్కించుకొని అందరితో ‘ఔరా’ అనిపించుకుంటున్నారు.

గోపాల్.. సదయ్యన్ అనే ఇద్దరు స్నేహితులు పాములు పట్టడంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న టెక్నిక్ లను పాటిస్తూ ఎలాంటి కోరలున్న పామునైనా తేలిగ్గా పట్టుకోవడం నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు పాములు పట్టడంలో నిష్టాణుతులుగా మారరు. వీరిద్దరు కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాములు పట్టడంలో ముందుంటారు.
 
తమిళనాడు చెంగల్వపట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గానికి చెందిన వడివేల్‌ గోపాల్‌.. మాసి సడయన్‌ నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పాములను పట్టడంలో ప్రజలకు శిక్షణ ఇస్తున్నారు. వారసత్వంగా వచ్చిన పురాతను టెక్నిక్ లను పాములు పట్టే వారికి చెబుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.

కాగా రెండేళ్ల క్రితం అమెరికాలోని ఫ్లోరిడాలో కొండచిలువలను పట్టుకోవడానికి పైథాన్ ఛాలెంజ్‌ప్రారంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 800 మందికి పైగా పాములు పట్టేవారు పాల్గొనగా గోపాల్.. సదయ్య బృందం సైతం పాల్గొంది. ఫ్లోరిడాలో అంతరించిపోతున్న అనేక బర్మీస్ కొండ చిలువలను పట్టుకున్నారు.

ఫ్లోరిడాలో పది రోజుల్లో 14 ప్రమాదకరమైన కొండచిలువలను గోపాల్.. మాసి సదయన్ పట్టుకున్నట్లు సమాచారం. వీరి కళను చూసి ఫ్లోరిడా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అధికారులు ముగ్ధులయ్యారు. అక్కడి వారికి పాములను ఎలా పట్టుకోవాలో నేర్పడానికి వీరిని నియమించుకున్నారు.

ఆ తర్వాత వీరిద్దరికి థాయ్‌లాండ్.. ఇతర దేశాల నుంచి పాములను పట్టుకోవడానికి పిలుపు వచ్చింది. వీరిద్దరు అనేక దేశాలు పర్యటిస్తూ అనేక మంది యువకులకు పాములు పట్టడంలో మెలకువలు నేర్పిస్తున్నారు. ఈక్రమంలోనే 2023 సంవత్సరానికిగాను వడివేల్‌ గోపాల్‌.. మాసి సడయన్‌ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News