ఓటు వేయటానికి వెళ్లినోళ్లకు వీవీ ప్యాట్ లో పాము దర్శనమిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించటానికి కూడా వీలు కాని ఈ ఉదంతం నిజంగానే చోటు చేసుకుంది. కేరళలోని కన్నూర్ లోక్ సభ స్థానం పరిధిలోని ఒక పోలింగ్ స్టేషన్లో వీవీ ప్యాట్ లో ఒక పాము కనిపించటంతో అక్కడ వారంతా షాక్ కు గురైన పరిస్థితి.
కన్నూర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మయ్యిల్ కందక్కయ్ లోని పోలింగ్ బూత్ లోని వీవీ ఫ్యాట్ లో ఒక పాము దర్శనమిచ్చింది. దీంతో.. ఎన్నికల సిబ్బంది.. ఓటర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలింగ్ కు కాసేపు అంతరాయం చోటు చేసుకుంది. అసలు వీవీ ప్యాట్ లోకి పాము ఎలా దూరిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
వీవీ ప్యాట్ లో పాము ఉండటంతో కాసేపు పోలింగ్ ను నిలిపివేశారు. అందులో నుంచి పామును తీసి.. దూరంగా వదిలేశారు.ఈ విషయం మీద అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ దేశ వ్యాప్తంగా 117 స్థానాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. 13 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలు రాష్ట్రాల వారీగా..
+ గుజరాత్ లో 26
+ కేరళలో 20
+ యూపీలో 10
+ ఛత్తీస్ గఢ్ లో 7
+ ఒడిశాలో 6
+ అసోంలో 4
+ బిహార్ 6
+ పశ్చిమ బంగాల్ లో 6
+ మహారాష్ట్ర 14
+ కర్నాటకలో 14
+ గోవా 1
+ త్రిపుర 1
+ దాద్రా నగర్ హవేలి 1
+ డామన్ డయ్యూ 1
+ త్రిపురల్లో 1